విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా జైలు ప్రధాన కార్యాలయపు నిరుపయోగమైన ఫర్నిచర్ విడిభాగాలను బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా జైలు పర్యవేక్షణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకారాగారం ప్రధాన కార్యాలయంలో ఫర్నిచర్ చెక్కలకు సంబంధించి విడిభాగాలను ఈనెల 24వ తేదీ ఉదయం 11.00గం.లకు మంగళగిరి ప్రధాన కార్యాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా కారాగార పర్యవేక్షణాధికారి తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాలలోని వడ్రంగి దుకాణదారులు వేలంపాటలో పాల్గొనవచ్చునని, వేలంపాటలో పాల్గొనేవారు రు 2000/ధరావత్తు సొమ్ము చెల్లించాలన్నారు. వేలంపాటలో నెగ్గని పాట దారులకు ధరావత్తు సొమ్ము వెంటనే తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ పని దినములలో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒటిగంట వరుకు, తిరిగి రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జైలర్ ఫోన్ నెంబర్-94946 32700.
మెయిన్ గేట్ నెంబరు-0866-2574236.
ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చునని కారాగారపు పర్యవేక్షణ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News