వైఎస్సార్ చేయూత మూడో విడత ద్వారా సెంట్రల్ లో 10,875 మందికి రూ.20.39 కోట్ల లబ్ధి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం మహిళలకు గొప్ప భరోసానిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మూడో విడత చేయూత ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో 10,875 మందికి 20 కోట్ల 39 లక్షల 6 వేల 250 రూపాయల లబ్ధి చేకూరనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసానందిస్తూ.. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్‌ లలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి చేయూత పథకం ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,034 మంది ఆడపడుచులకి రూ. 11.31 కోట్లు.. 2021-22 ఏడాదిలో 6,232 మంది ఖాతాలలో రూ. 11.68 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. 43.38 కోట్లు అక్కచెల్లెమ్మలకు మూడేళ్లలో లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తోన్న సాయాన్ని సద్వినియోగపరచుకుని మహిళలందరూ ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *