కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి ఫిలోడెండ్రన్, అగ్లోనిమా అంజుమని..

-అక్సిజన్ ప్యూరిఫైర్ మొక్కను అందజేసిన నిర్వాహుకులు

కడియం(రాజమహేంద్రవరం),  నేటి పత్రిక ప్రజావార్త:
హరిత నగరాలు పట్ల ప్రత్యక మైన అనురక్తి ఉందని ఈ ప్రాంతం “ సిటీ ఆఫ్ నర్సిరీస్” గా ప్రత్యేకత సంతరించుకుందని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గురువారం కడియం లోన సత్యదేవ్ నర్సరీలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సందర్శించారు. ఈ సందర్బంగా జాతీయ రహదారుల పై ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే జాతుల మొక్కలను పెంచే దిశలో ఉపయోగపడే మొక్కల వివరాలను నర్సరీ నిర్వాహుకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా భారీ వర్షంలో కూడా నర్సరీ ప్రాంతాన్ని బ్యాటరీ కారు ద్వారా సందర్శించి అక్కడ పెంచుతున్న మొక్కల వివరాలను తెలుసుకోవడంతో పాటు అనంతరం నర్సరీ యజమానులు అందజేసిన వినతి పత్రాలను స్వీకరించారు. తొలుత కడియం నర్సరీకి చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి సత్యదేవ్ నర్సరీ యాజమాన్యం నర్సరీ సంఘం ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నర్సరీ ఆవరణలో “లోప్రాంతస్ లాక్టిసెనిసేన్స్ (గోల్డ్ చైన్)” అరుదైన జాతి మొక్కను మంత్రి నాటారు. అనంతరం సత్యదేవ్ నర్సరీ ప్రతినిధులు కడియం నర్సరీ లో పెంచుతున్న ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే అవెన్యూ, డెకరేషన్ మొక్కల వివరాలు నర్సరీ నిర్వాహకులు చూపించడం జరిగింది. వీటిలో జాతీయ రహదారుల పై ఏర్పాటుకు అనుకూలంగా ఉండే జాతుల మొక్కలు, వాటి పెంపకం, నిర్వహన వంటి అంశాలపై కేంద్ర మంత్రికి వివరాలు తెలియజేశారు. రాజమహేంద్రవరం వేధికపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారి మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా మూడు అంశాలను గుర్తుంచుకోవాలని నీటి,గారి, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని నివారించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా వాతావరణంలో వాయు కాలుష్యం త్రీవ్రమైన సమస్యగా ఉందని ఇందుకు ఆయిల్ వినియోగం ప్రధాన కారణం అన్నారు. హైడ్రో ఫవర్ వినియోగం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోగలుగుతామన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగం ద్వారా వైవిద్యమైన ఉత్పత్తులను నివారణ మార్గాలను కనుగొనే ఆలోచన వచ్చిందన్నారు. హరిత నగరాల ఏర్పాటు పై ప్రత ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తద్వారా దేశంలో పర్యావరణ పరిరక్షణను చేపట్టగలుగుతామన్నారు. దేశంలో 17 లక్షల కోట్లను ఆయిల్ కోసం ఖర్చు చేయడం జరుగుతుందని అన్న దాతలను ఉత్పాధన దాతలుగా ఎకో డైవర్సిటీ లోకి తీసుకురావాలన్నాతే తమ ఆశయమన్నారు. చెరకు, మొక్క జొన్న, వరి, ఆహార పదార్థాలు అన్ని అవసరానికి తగ్గట్టు ఉత్పాధన జరగటం లేదన్నారు. పామాయిల్ ఉత్పత్తులను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణ చేపట్టడం ద్వారా ఆత్మనిర్భర్ సాధించగలుగుతామన్నారు. ఆహార ఉత్పత్తులు నుంచి బయో డీజిల్ ను తయారు చేయడం ద్వారా భారత దేశ ఆర్థిక పరిపుష్టిని పెంచగలుగుతామన్నారు. నీటి నుంచి హైడ్రోజన్ ప్రోసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఫవర్ ను సూర్యుని ద్వారా సోలార్ ఫవర్ జనరేషన్ పై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉందన్నారు. ఒక మొక్కను నరికితే పది మొక్కలు నాటే విధానం అమలు చేయాల్సి ఉంటుందని గడ్కారి పేర్కొన్నారు. ట్రీ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సమర్థవంతంగా చేపడతామన్నారు. దేశంల 27 హరిత జాతీయ రహదారుల ప్రాజెక్టులను రోడ్డు రవాణా శాఖ మంత్రి ఏర్పాటు చేశామన్నారు. దేశంలో నానాటికీ దేశ జనాభా, ఆటో మొబైల్ వాహనాలు సంఖ్య పెరుగుతుందన్నారు. సేతు భారతం ద్వారా దేశంలో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందుకోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా తగు ప్రతిపాధనలు వస్తే సానుకూలంగా స్పందిస్తామన తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం భూమి ఇస్తే లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వచ్చిన ప్రతి ఒక్క ప్రతిపాధన తప్పకుండా సాకారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరి రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రు.3,000 కోట్లుతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.ఈ పనుల్లో భాగంగా 5 పై వంతెన పనులు, మూడు రహదారుల నిర్మాణం పనులు చేశారు.

ఇందులో భాగంగా – 1) వాకలపూడి – ఉప్పాడ – అన్నవరం NH – 516F లేనింగ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్ట్ పొడవు 40.621 కిమీ ప్రాజెక్ట్ వ్యయం : రు.1345 కోట్లు.
2) సామర్లకోట – అచ్చంపేట జంక్షన్ NH – 516F 4 లేనింగ్, ప్రాజెక్ట్ పొడవు: 12.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 710 కోట్లు,3) రంపచోడవరం నుండి కొయ్యూరు NH – 516E వరకు 2-లేన్ల నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 70.12 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 570 కోట్ల, 4) కైకరం NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.795 కిమీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.70 కోట్లు,5) మోరంపూడి NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ పని ప్రారంభం, ప్రాజెక్ట్ పొడవు: 1.42 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 60 కోట్లు.6) ఉండ్రాజవరం NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.35 కోట్లు,7) తేతాలి NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.03 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 35 కోట్లు,8) జొన్నాడ NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 0.93 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 25 కోట్లుతో చేపట్టే పనులకు శంఖుస్థాపన చేసారు.

కార్యక్రమంలో యంపి భరత్ రామ్, కలెక్టర్ డా.కె. మాధవీలత, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డిహెచ్ఓ. ఎమ్.రాధాకృష్ణ, తహశీల్దార్, ఎంపిడివో, సి ఐ, సత్యదేవ్ నర్సరీ నిర్వాహకులు పుల్లా ఆంజనేయులు, రాజశేఖర్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *