వాల్మీకి, బోయలని మభ్యపెడుతున్న జగన్మోహన్ రెడ్డి… : ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి, బోయలని ఎస్టీల్లోకి చేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రొత్తగా ఏకసభ్య కమిషన్ పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యాముల్ ఆనందకుమార్ని నియమించడాన్ని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోందని, ఇది జగన్ ప్రభుత్వం వాల్మీకి, బోయిలపై చెన్నచూపెనని విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వాల్మీకి, బోయిలని ఎస్టీల్లో చర్చడానికి సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం జరిపి అసెంబ్లీలో తీర్మానం చేసి నివేదికను కేంద్రప్రభుత్వానికి తదుపరి చర్యలు తీసుకోవాలని పంపి చేతులు దుపుకుందని గుర్తు చేసారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయడమంటే వాల్మీకి, బోయిలపై సవతి తల్లి ప్రేమేనని మరొకసారి వారి సమస్యలను రాజకీయంగా అణచివేతకు గురిచేయడమే కాక వారి భవిష్యత్తు అంధకారం చేయడమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నా గత మూడున్నర సంవత్సరాలుగా పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఎందుకు లెవనెత్తలేదో వాల్మీకి బోయిలకి సమాధానం చెప్పాలని కోరారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి వాల్మీకి, బోయిలపై ప్రేమ ఉంటే కొత్తగా ఏకసభ్య కమిషన్తో కాలయాపన చేయకుండా వెంటనే జీఓ నెం52ని రద్దుచేసి సత్యపాల్ కమిటీ అధ్యయనం ద్వారా ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కేంద్రానికి పంపిన నివేదిక మీద కేంద్రంపై వత్తిడి చేసి పార్లమెంట్లో గొంతువిప్పి వాల్మీకి, బోయిలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇతర కులాలైన వడ్డెర, రజక, బెస్త కులాలపై అధ్యయన నివేదికలపై ఎస్టీ, ఎస్సీ ల్లో చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *