నల్సా వయో వృద్ధుల న్యాయ సేవల పథకం 2016…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వయో వృద్దులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించడం, పొందడం కోసం సమస్య తెలియ చెయ్యాల్సిన బాధ్యత వారిపైనే ఉందని 5 వ  అదనపు జిల్లా న్యాయమూర్తి డి.విజయ్ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో సి టి ఆర్ ఐ సమీపంలో గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ద ఆశ్రమం నందు “నల్సా వయో వృద్ధుల న్యాయ సేవల పథకం, 2016 ” పై నిర్వహించిన కార్యక్రమానికి గౌరవ 5 వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.విజయ్ గౌతమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వయోవృద్ధులక హక్కుల సంరక్షణకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. వారి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థలకు తెలియజేయాల్సిన బాధ్యత వారిదే అనే తెలిపారు. పారా లీగల్ వాలంటీర్లు, ప్యానల్ లాయర్ల ద్వారా వారి ఫిర్యాదులని ఈ సంస్థకు అందించవచ్చని తెలియజేశారు. పింఛన్లు అందకపోయినా, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోయినా, అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందకపోయినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అన్ని న్యాయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. వృద్దులకు చెందిన హక్కులు ఆచరణలో తీసుకుని వొచ్చే సామాజిక బాధ్యత మనందరిపై ఉందన్నారు. కోర్టు లు ద్వారా అందచేసే వృద్ధుల యొక్క సేవలను పలువురు వక్తలు వివరించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అక్కడున్న పలువురు వృద్ధుల నుండి అర్జీలను తీసుకున్నారు. అనంతరం వారికి దుప్పట్లు, ఫలహారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి, 4 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి.సాయి సుధా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, సౌత్ జోన్ డీఎస్పీ ఎం. శ్రీలతా, తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంస్థ అధ్యక్షులు కె.మదన్ మోహన్ రెడ్డి, రాజమహేంద్రవరం డీ.ఎం.హెచ్.ఓ ప్రోగ్రాం ఆఫీసర్ మౌనిక, సి.డీ.పీ.ఓ. కె.వెంకట నరసమ్మ, గౌతమి జీవ కారుణ్య సంఘం ఐ.ఓ కృష్ణవేణి, డా.అశోక్ కుమార్, వృద్దులు, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, లా విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *