రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 2023 ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా క్షేత్ర స్థాయి అధికారులకి, సిబ్బందికి, క్షేత్ర స్థాయి లో అవగాహన పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారులు / జిల్లా కలెక్టర్ లతో న్యూ ఢిల్లీ నుంచి ” సీనియర్ డిప్యూటీ ఈ సి – నితీష్ కుమార్ వ్యాస్” నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ విసి హల్ నుంచి కలెక్టర్ ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా, గత ఏడాది కి ఈ ఏడాదికి విశ్లేషణ, జెండర్, 18 ఏళ్లు నిండిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎలక్టోరోల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 1559 పోలింగ్ కేంద్రాల పరిధిలో 15,41,332 మంది ఓటర్లు ఉన్నారని వారిలో పురుషులు 756380, మహిళలు 784833 మంది, ఇతరులు 119 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
నవంబర్ 9 వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటన చేసిన నాటికి, 2022 జనవరి 5 న ప్రకటించిన జాబితా మేరకు జిల్లాలో 29,298 మంది ఓటర్ల సంఖ్య తగ్గుదల గుర్తించామని, ప్రస్తుతం ఇంటింటి ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ చేపట్టడం ద్వారా జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జెండర్ రేషియో 1039 గా ఉందని తెలిపారు. బి ఎల్ ఓ లు ఆయా పోలింగ్ కేంద్రాల లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ వ్యవధి09.11.2022 నుండి 8.12.2022 వరకు ఇవ్వడం జరిగిందని, ఆలోగా ప్రతివ్యక్తి నుంచి సమగ్ర డేటా తెలుసు కోవడం జరుగుతుందన్నారు. జాబితా లో ఓటర్ల చేర్పు, తొలగించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా . తదుపరి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు డిసెంబర్ 12 నుంచి 26 వరకు, బి ఎల్ ఓ ల ద్వారా వర్కింగ్ కాపీని ధృవీకరించే సమయంలో/ సప్లిమెంట్‌ల ప్రింటింగ్ మరియు రోల్ చివరి ప్రచురణ కు డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 4 వరకు బి ఎల్ ఓ లు ఓటరు నమోదు కార్యక్రమం అత్యంత పారదర్శకం గా చేపట్టాలని, నియోజక వర్గ ఓటరు నమోదు అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 99.97 శాతం మంది ఓటర్లు ఓటర్ కార్డులు (ఎపిక్) జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా జనాభా లెక్కల ప్రకారం 18-19 మధ్య వయస్సు ఉన్న వారు సుమారు 48 వేల మంది ఉండగా, వారిలో సుమారు 7800 మందికి మాత్రమే ఓటరుగా నమోదు అయినట్లు గుర్తించామన్నారు. ఈ కేటగిరీలో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు నిర్వహించిన ఆధార్ కార్డు ఆధారంగా స్వచ్ఛందంగా ఓటు హక్కుకలుగ చేసే విధానం అమలు చేయడం జరుగుతున్నట్లు వివరించారు.
ఈ సమావేశానికి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్ వో జీ. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, రాజమహేంద్రవరం అర్బన్ కి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం గ్రామీణ కి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం టి ఇ ఎం రాజు లు ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్య లక్ష్మి లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News