రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం నాటికి అర్భికే ల ద్వారా సుమారు 992 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 30709 మంది రైతుల నుంచి 1,51,203 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ ల హెచ్చరిక జారీ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే కంట్రోల్ రూం నంబర్ల కి ఫోన్ చేసి తగిన సమాచారం పొందవొచ్చు నని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 8309487151 మరియు 08832940788 నకు ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించడం ద్వారా తగిన సమాచారం పొందవచ్చునని పేర్కొన్నారు
Tags rajamendri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News