Breaking News

ఆదర్శ వ్యవసాయ కళాశాలగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల…

-అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వజ్రోత్సవ వేడుకలు.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వజ్రోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా కళాశాల వజ్రోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 600 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో 1961 వ సంవత్సరం నుంచి వ్యవసాయ డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేసారు. వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్య పూర్తి చేసుకుని వ్యవసాయ శాఖలో, బ్యాంకింగ్ రంగంలో, వివిధ సేవా రంగాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో హోదాల్లో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, వ్యాపార రంగంలో స్థిరపడిన వారు వేడుకల్లో పాల్గొన్నారు. వజ్రోత్సవాలు వేడుకల కోసం శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలను యాజమాన్యం సుందరీకరించడంతోపాటు విద్యార్థుల సహకారంతో శ్రీవారి శంకు, చక్ర, నామాల ప్రతిష్టించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి , అధికారులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో శంకు, చక్ర నామాలకు పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వజ్రోత్సవ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఎఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ రెడ్డి, రిజిస్టార్ డాక్టర్ జి. రామారావు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘము ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఐ. రామచంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ డబ్ల్యూ. ఆర్. రెడ్డి, మాజీ ఉపకులపతి డాక్టర్ పి. రాఘవరెడ్డి, తూ. గో జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవవీలత, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభ రెడ్డి తదితరులు హాజరై శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల 60 సంవత్సరాల ప్రగతిని క్రోడీకరించి సిద్ధం చేసిన
సావనీర్ విడుదల చేశారు. ఇదే వేదిక మీద వజ్రోత్సవ చిహ్నం ను అతిథులు ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్. పి. వాసంతి కళాశాలలో ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించిన ప్రగతి
నివేదికను ఆమె నివేదించారు. పూర్వ విద్యార్థులు, అతిథులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణమైన కళాశాలకు రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేసారు.
ఈ సమావేశంలో ఆచారి ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి ఎంత కీర్తి గడిచిందని, కబ్జాల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం ఎంతోమంది వ్యవసాయ రంగ నిపుణులు సిద్ధం చేసి దేశ సేవకు అంకితం చేసిందన్నారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందమైన వ్యవసాయ విద్యను అందించే జాతీయ స్థాయిలో 11వ స్థానంలో నిలిచిందని చేశారు. బోధన బోధ నేతల సిబ్బంది కృషి పరిశోధనల ఫలితంగా ఈ గుర్తింపు సాధించామని, భవిష్యత్తులో అనేక పరిశోధనలకు నిలయంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం మారుతుందని ఆయన ప్రకటించారు. వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలను ఆదర్శవంతమైన కళాశాలగా తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా మాట్లాడుతూ దేశంలో గ్రామీణ యొక్క ఎక్కువగా ఉందని వారు నైపుణ్యాలు పెంచడం ద్వారా గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మన ముందు సుస్థిర వ్యవసాయ అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయని, వాతావరణ మార్పులను తట్టుకొని వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించడం కోసం వ్యవసాయం వైపు యువతను ఆకర్షించాలని, వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ద్వారా ఆహార భద్రత సాధించగలుగుతామని ఆయన అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత దిశగా వ్యవసాయ విద్యలో మార్పులు అవసరమని పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మనం మన లక్ష్యాలను సాధించడంలో వ్యవసాయ విద్యలో మార్పులు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వజ్రోత్సవ వేడుకలు వారం కూడా కొనసాగునున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *