Breaking News

తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి

-అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు
-గ్రామీణ పర్యాటక, పుణ్యక్షేత్రాల, బీచ్ టూరిజం అభివృద్దికి చర్యలు: డి.ఆర్.ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో పర్యాటక రంగంకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, మెరుగైన టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్ని శాఖల సమ్వయంతో ఇది సాధ్యం అని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు.

సోమవారం మధ్యాహ్న౦ స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా పర్యాటక కౌన్సిల్ మొదటి సమావేశంలో డి ఆర్ ఓ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఇది సుసాధ్యం అవుతుందని అన్నారు. పర్యాటక రంగం అనేది స్థానిక ప్రదేశాల్లో ఉన్న ఆర్థిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్నదని, పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయడం కొరకు కమిటీ సభ్యుల సూచనలు సలహాల మేరకు పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వివిధ మండలాల తహసిల్దార్ల నుండి భూమి అలియనేషణ్ పర్యాటక శాఖ పంపిన ప్రతిపాదనలకు త్వరితగతిన అప్పగించాల్సి ఉన్నదని, కొత్త ప్రతిపాదనల భూకేటాయింపుల కొరకు సంబందిత ఆర్.డి.ఓ లు సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గౌ. పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె రోజా పర్యాటక అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నారని, జనవరిలో నిర్వహించబోవు ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘణంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. బీచ్ టూరిజం అభివృద్దికి నవాబ్ పేట బీచ్ నుండి రాజి బీచ్ వరకు మధ్యలో గల కొత్త బీచ్ ల అభివృద్ధి భూ సేకరణ కొరకు సి.ఈ.ఓ పర్యాటక శాఖ వారి నుండి అందిన ప్రతిపాదనలపై 9 ప్రాంతాలలో భూమి గుర్తించుట కొరకు జిల్లా కలెక్టర్ నుండి పంపబడిన ప్రతిపాదనల పై ఆర్.డి.ఓ గూడూరు , తహసిల్దార్ వాకాడు , చిట్టమూరు సత్వరమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపెంద్ర నాథ్ పలు అంశాలు చర్చించారు. పలువురు కౌన్సిల్ సభ్యులు శ్రీకాళహస్తి లోని కలంకారి ప్రాసస్త్యాన్ని పెంచుట కొరకు శిక్షాణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పౌరాణిక, సాంస్కృతిక సంగీత, నృత్య వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు అందించే దిశగా మెరుగైన ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్బంగా తుడ కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ తుడా పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తదితర ప్రాంతాలలో పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి చర్యలు తుడా చైర్మన్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి వారి ఆద్వర్యంలో చేపడతామని తెలిపారు.

పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్ కింద శ్రీ కాళహస్తి హెరిటేజ్ సర్క్యూట్ ప్రాజెక్ట్ మరియు స్టేట్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏర్పాటులో భాగంగా గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్ శ్రీకాళహస్తి, పానగల్ గ్రామం వద్ద రూ. 19.80 లక్షలు తో పనులు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ నిర్వహిస్తో౦దని అన్నారు. గ్రామీణ పర్యాటక ప్రాంతాల అభివృద్దికి రూ.21.95 కోట్లు మంజూరు కాగ అందులో రూ.13.57 కోట్లతో సురుటుపల్లి, నాగలాపురం, నారాయణవనం, తొండమనాడు, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, బొక్కిసం పాళెం, కాణిపాకం అభివృద్ధి పనులు పూర్తి చేసి సంబందిత ఈ.ఓ లకు అప్పగించడమైనదని, గుడిమల్లం ల్యాండ్ కు సంబందించి, చంద్రగిరి కోటకు సంబందించిన ఆర్క్యాలజి సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతులు , శ్రీవారి మెట్టు కు సంబందించిన పనుల అటవీ శాఖా అభ్యంతరాల పై తగిన చర్యలు సంబందిత అధికారులు చేపట్టాలని కోరారు.

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో రోజుకు 3 వేలమంది పైన పర్యాటకులు సందర్శన లేదా నెలకు కోటి రూపాయల ఆదాయ౦ వస్తున్న పుణ్యక్షేత్రాలలో పర్యాటక సమాచార కేంద్రాల ఏర్పాటు కోసం శ్రీ కాళహస్తి, తాతయ్య గుంట గంగమ్మ , శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి సూళ్ళూరు పేటలోని ఈ.ఓ ల ను నుండి సమ్మతించిన మేరకు సి.ఈ.ఓ గారికి ప్రతిపాదనలు పంపడమైనదని, తిరపతి జిల్లా స్థానిక మరియు స్థానికేతర టి.టి.డి దేవాలయాల పరిధిలోని ఆవరణలో 500 నుండి 1000 చదరపు అడుగుల కేటాయింపు కోసం సంబందిత ఈ.ఓ లు చర్యలు చేపట్టి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.

ఈ సమావేశంలో గూడూరు, సూళ్ళూరు పేట ఆర్.డి.ఓ లు కిరణ్ కుమార్ , రోస్ మాండ్, డి.వి.ఎం ఏ.పి.టి.డి.సి గిరిధర్, డి.ఎఫ్.ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్క్యాలజి శివ ప్రసాద్, కౌన్సిల్ మెంబర్లు మరియు ప్రత్యేక ఆహ్వానితులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *