టికె విశ్వేశ్వర రెడ్డి దీక్ష విరమణ

-గోదావరీ నది పరిరక్షణ కు చేసే సిఫార్సు లను ఎపి పేపర్ మిల్లు యాజమాన్యం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం..
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది జలాలు కలుషితం కాకుండా చూడాలని గత 45 రోజులుగా గోదావరీ నది జలాలు పరిరక్షణ సమితి అధ్యక్షుడు టికే విశ్వేశ్వర రెడ్డి, బర్రె కొండబాబు ల దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింప చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం పేపర్ మిల్లు వద్ద ఉన్న దీక్షా శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, గోదావరి నదిలో కలిసే వ్యర్ధాలు కలవ కుండా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని డిమాండు చేస్తూన్న నేపథ్యంలో ఇందుకోసం నిపుణుల బృందం తో అధ్యయనం చేయ్యాడం జరుగుతుందని హామీ ఇచ్చామన్నారు . రాజమహేంద్రవరం నగరం గోదావరి నది తీరంలో ఉండడం వల్ల ఈనది పరిరక్షణ మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. గోదావరీ జలాలు పుణ్య స్నానాలు తో పాటు త్రాగునీటి కోసం వినియోగించడం జరుగుతోందన్నారు. ప్రజల అవసరాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం అన్నారు. పేపర్ మిల్లు నుంచి విడుదల అయ్యే వ్యర్ధాలను శుద్ది చేసి, గోదావరీ లో కలిసే ప్రక్రియ పై నీటి శుద్ధి కేంద్రము ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మిల్లు ద్వారా సుమారు ఆరువేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. గోదావరీ నది కలుషితం కాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా ఈ విషయాలను తీసుకుని వెళ్లి గోదావరీ నది పరిరక్షణకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటా మని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈవిధానంలో ప్రత్యేక సలహాదారు లను నియమించి వారి సిఫార్సుల కు అనుగుణంగా చర్యలు తీసుకుంటా మన్నారు. గోదావరీ నదిలో కలిసే కలుషితమైన నీరు ఎక్కడ కలిస్తే పొల్యూషన్ కాకుండా ఉంటుంది అని అధ్యయనం చేసి, సలహాదారుల సిఫార్స్ ల మేరకు ఎపి పేపర్ మిల్లు యాజమాన్యం ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *