రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో శుక్రవారం హై కోర్టు జడ్జ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ కార్యాలయమును వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. వెంకట జ్యోతిర్మయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి తో పాటు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ కార్యాలయంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ గా నియమితులైన లాయర్లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నల్సా వారి మోడిఫైడ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ (LDAC) స్కీమ్, 2022 ద్వారా డిఫెన్స్/ముద్దాయి తరపున పూర్తి స్థాయి ఉచిత న్యాయ సేవలను అందించడమే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ యొక్క లక్ష్యం. ప్రీ-అరెస్ట్, అరెస్ట్, రిమాండ్, ట్రయల్, అప్పీలు మరియు ఇతర క్రిమినల్ మిస్లేనియస్ పీటీషన్లు ఏ దశలో ఉన్నా ఉచిత న్యాయ సేవలు అందించబడతాయి, వారి తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించబడుతుంది. కావున ఈ విధమైన న్యాయ సేవలు అవసరమైన అర్హులు మరియు కారాగారములో ఉన్న ముద్దాయిలు తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన సముదాయముల ప్రాంగణంలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఈ సేవలను వినియోగించుకోవాలని కోరడమైనది.
సంప్రదించవలసిన నెంబర్లు
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ : 0883-2941047
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, తూర్పు గోదావరి జిల్లా : 0883-2470185
9440901047
టోల్ ఫ్రీ నెం. : 15100
Prajavartha Online Telugu News