ప్రభుత్వం తరపున చేపట్టనున్న ప్రాజెక్ట్ వివరాలు పై చర్చ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పర్యాటక రంగం అభివృద్ధి లో భాగంగా పిచ్చుక ల్లంక, హెవల్యాక్ బ్రిడ్జి లపై చర్చించడానికి ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులతో ఎయిర్ పోర్ట్ లో సమావేశం అయి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టనున్న ప్రాజెక్ట్ వివరాలు పై చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్లు రూ.700 కోట్లతో చేపడుతున్న పిచ్చుకల్లంక గ్రామంలో చేపడుతున్న పనులపై, హెవల్యాక్ బ్రిడ్జి అభివృద్ధి కి చేపడుతున్న అభివృద్ధి పనులు పై ఫోటో ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళుతూ మార్గ మధ్యలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఓబ్రాయి గ్రూప్ నకు చెందిన బృందం తూర్పు, కోనసీమ జిల్లాల్లో చేపట్టే ప్రాజెక్ట్ పై చర్చించడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ – కొత్తపేట శాసన సభ్యులు సిహెచ్. జగ్గి రెడ్డి,  డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమన్ష్ శుక్లా,   ది ఒబెరాయ్ గ్రూప్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి మరియు ఎమ్ డి మిస్టర్ విక్రమ్ ఒబెరాయ్,  ప్రెసిడెంట్- కార్పొరేట్ వ్యవహారాలు రాజారామన్ శంకర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కల్లోల్ కుండు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కోనసీమ జాయింట్ కలెక్టర్ హెచ్. ఏం. ధ్యాన్ చంద్, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *