మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో బకాయి ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డ్లు, హోర్డింగ్ ఏజన్సీల నుండి మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలని, ఏసిపి, టిపిఎస్ ల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మీడియా డివైజ్ ఫీజుల వసూళ్లలో పురోగతి లేదని, ప్రత్యేక బృందాల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఫీజులు చెల్లించని వారి బోర్డ్ లను తొలగించాలని స్పష్టం చేశారు. టిపిఎస్ లు, ఏసిపిల వారీగా బకాయిల వసూళ్లకు లక్ష్యాన్ని నిర్దేశించాలన్నారు. అలాగే బోర్డ్ లకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని, ప్రతి బోర్డ్ కు జియోట్యాగ్ లను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నగరంలో ఉన్న అనధికార లే అవుట్స్ ని ఇన్ ప్రిన్సిపుల్ లే అవుట్స్ గా అప్లై చేయించాలని, వాటికి అనుమతులు వస్తేనే నూతన భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి వీలు కల్గుతుందన్నారు. రోడ్ విస్తరణ పనులను సమీక్షించి ప్రధాన రహదార్లు విస్తరణ పనులు దాదాపు పూర్తీ అయ్యాయని, ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే 2 రోజుల్లో పూర్తీ చేయాలన్నారు. విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నూతనంగా విస్తరణ పనులు చేపట్టే ప్రాంతాల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. విభాగ కోర్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని, కౌంటర్స్, ప్యార వైజ్ రిమార్క్స్ పక్కాగా నిర్దేశిత గడువులోగా కోర్ట్ కు పంపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల గోడలు, పబ్లిక్ ప్రాంతాల్లో వాల్ పోస్టర్స్ అంటించే వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, సూపరిండేంట్ ప్రసాద్, సర్వేయర్ సునీల్ కుమార్, టి.పి.ఎస్.లు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *