Breaking News

జగనన్న లేఔట్ల గృహ నిర్మాణ పనుల్లో వారం వారం పురోగతిని సాధించాలి.

-వెనుకబడిన మండల అధికారులపై చర్యలు తప్పవు.
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపట్టిన జగనన్న లేఔట్స్ గృహ నిర్మాణాలు, నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు వారం వారం పురోగతిని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు , జాయింట్ కలెక్టర్ నుపూరు అజయ్, డిఆర్వో కె. మోహన్ కుమార్ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు మండలాధికారులతో సమీక్షించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాల పనులు మరింత వేగవంతం చేయాలన్నారు . వివిధ స్థాయిల్లో ఉన్న గృహ నిర్మాణ పనులు పూర్తీ స్థాయికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 16,000 వేల గృహ నిర్మాణాలు మార్చి నాటికీ పూర్తీ చేయవలసిన లక్ష్యం కాగా 6,600 గృహాలు నిర్మాణాలు జరిగాయని , మిగిలిన 9,400 వివిధ స్థాయిల్లో పనులు జరుగుతున్నాయన్నారు. జగ్గయ్యపేట వత్సవాయి మండలాలలో గృహ నిర్మాణ పనులలో పురోగతి బాగుందన్నారు. జి కొండూరు, మైలవరం, చందర్ల పాడు విజయవాడ రూరల్ మండలాలు నందిగామ, విస్సన్నపేట , తిరువూరు అర్బన్ మండలాల్లో గృహ నిర్మాణ పనులు పురోగతిని సాధించాలన్నారు. వెనుకబడి ఉన్న మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక, సిమెంట్, కంకర అందుబాటులో ఉన్నప్పటికీ వారం వారం పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, దీనిపై లోపాలు సవరించుకోవాలని , అధికారులు ఇంజినీర్ లు టీం వర్క్ తో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన నాడు నేడు పనులు మెరుగ్గా ఉన్నాయని జిల్లాలో 589 స్కూల్స్ కి గాను రెండవ దశలో వివిధ రకాల 950 పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు . పాఠశాలలో టాయిలెట్స్ క్లీనింగ్ పైన, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పైన ఎంఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా టెన్త్ క్లాస్ ఉత్తమ ఫలితాలకు ఇప్పటినుండే భావనా బోధనపై ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. హౌస్ ఓల్డ్ స్పిట్స్, ఆయుష్మాన్ భారత్ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ కలెక్టర్ మరియు సమగ్ర శిక్షణ ఎపిసి గుడ్లా మహేశ్వరరావు , హౌసింగ్ పిడి వి. శ్రీదేవి , ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, యంపిడివోలు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *