రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే సేవలు నిమిత్తం ఎటువంటి రుసుములు వసూలు చేసిన ఉపేక్షించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత హెచ్చరించారు. ఇదే పునరావృతం ఐతే లైసెన్స్ రద్దు చెయ్యడం జరుగుతుందని అన్నారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు పై జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల ప్రతినిధులతో ఫిర్యాదుల వారీగా వివరణ తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య సేవలు విషయంలో ఎటువంటి నిర్లక్ష్య వైఖరి, నగదు వసూలు చేయడం, వైద్య సేవల్లో లోపాలు, స్కానింగ్ ఫీజ్ వసూలు, రోగిని చేర్చు కోవడానికి తిరస్కరించడం వంటి అనేక ఫిర్యాదు లు రావడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు పొందిన వ్యక్తులు ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొత్తం 202 ఫిర్యాదులు 47 సచివాలయాల పరిధిలో నమోదు చేసినట్లు తెలిపారు. 48 ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించి 105, రిజిస్ట్రేషన్ సంబంధించి 48 , ఇతరాలు 49 ఫిర్యాదులు జిల్లా పరిధిలో వివిధ ఆసుపత్రుల పై నమోదు అవ్వడం జరిగిందన్నారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి తో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్
ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన ఎం. వెంకటేష్, పేషంట్ తో కలెక్టర్ మాధవీలత టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఫిర్యాదు చేయడంతో స్పష్టత ఉండాలని, ముఖ్యమంత్రి మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మీ సమగ్ర సమాచారం అందిస్తే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని మాధవీలత తెలిపారు.
ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించే రోగుల నుంచి ఏమైనా నగదు వసూలు చేసినట్లు అయితే వాటిని డిశ్చార్జ్ చేసే సమయంలో ఇవ్వకుండా ఫిర్యాదు తదుపరి తిరిగి ఇవ్వడం పై కలెక్టర్ మాధవీలత వివరణ కోరారు. వైద్య సేవల విషయంలో ఆసుపత్రుల ఉద్దేశ్య పూర్వకంగా తప్పు చేసినట్లైతే వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అకిరా, అంజనా వైద్య శాల, అన్నపూర్ణ, అసెంట్, స్వతంత్ర, చక్రధర్, డెల్టా, అరవింద్, గౌతమి, సిద్దార్ధ, జీఎస్ఎల్, కిమ్స్, రేవతి, జిల్లా ఆసుపత్రి, రాయల్, సాయి, శ్రీలత, ప్రశాంతి, తదితర 48 ఆసుపత్రుల వారిగా ఫిర్యాదుల వారీగా వివరణ తీసుకోవడం జరిగిందని అన్నారు. కొన్ని ఫిర్యాదులకు సంబంధించి పెనాల్టీ విధించడం జరిగిందని, ఇదే తీరు పునరావృతం అయితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్వెస్టిగేషన్, మందులు, ఓపి కార్డ్,. వైద్య సేవలకు చెందిన నగదు వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు.
లోపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రోగి డిశ్చార్జ్ చేసేకంటే ముందే అటువంటి మొత్తాలను వసూలు చేస్తే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఆయా యాజమాన్యాలదే అని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఆరోగ్య మిత్రాలు కూడా స్నేహ పూర్వకంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందే వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. నగదు వసూలు చేసే ఫిర్యాదులకు సంబంధించి ఆయా పేషంట్, ఆరోగ్య మిత్రా లను కూడా పిలిపించాలని మాధవీలత స్పష్టం చేశారు. ఆసుపత్రి కి వొచ్చే రోగి కి ఆరోగ్యశ్రీ పథకం ఉందా?, తెల్ల రేషన్ కార్డు? ఉందా తెలుసుకుని, అవగాహన కల్పించే బాధ్యత ఆయా ఆసుపత్రులదే అని మాధవీలత తెలిపారు.
ఈ సమావేశం లో సమన్వయ కర్త గా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డాll పి.ప్రియాంక, డి ఎం హెచ్ వో డా కె. వెంకటేశ్వర రావు, డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి హాజరయ్యారు.
Prajavartha Online Telugu News