రాజరాజేశ్వరి పేట నివాసితులకు న్యాయం చేస్తాం…

-జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజరాజేశ్వరిపేటలోని రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న కుటుంబాలకు న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు.
రాజరాజేశ్వరి పేట రైల్వే స్థల నివాసితులు, గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, రైల్వే, రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలోని రాజరాజేశ్వరిపేట 56 డివిజన్‌లోని రైల్వేకు సంబంధించిన స్థలంలో గత 40 సంవత్సరాలకు పైగా దాదాపు 800 కుటుంబాలవారు నివాసాలు ఏర్పరచుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపే విధంగా నగరపాలక సంస్థ అధికారులు రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్‌ మండలంలోని నున్న, రామవరప్పాడు, ప్రసాదంపాడు తదితర గ్రామాలలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కృష్ణానదీ జలాలను అందించడం, నున్న, రామవరప్పాడులలో రైతుబజార్ల ఏర్పాటు, ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించడం తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు.
సమావేశంలో కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ డి. దుర్గాప్రసాద్‌, తహాశీల్థార్లు యం మాధురి, జాహ్నవి, రైల్వే అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *