పోలింగ్ స్టేషన్ల ప్రస్తుత పేరును బట్టి పోలింగ్ స్టేషన్ల పేరు మార్పులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్, టీచర్స్, స్థానిక సంస్థల ఓటర్లు 1200 దాటిన పోలింగ్ కేంద్రాలలో అక్సలరీ పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటుకు, ఉన్న పోలింగ్ స్టేషన్ల ప్రస్తుత పేరును బట్టి పోలింగ్ స్టేషన్ల పేరు మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు.

సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటితో ఎం.ఎల్.సి. ఓటర్ల నమోదు పూర్తవుతుందని, ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 23 నాటికి జాబితా సిద్ధం చేయనున్నామని, అభ్యంతరాలు ఉంటే వ్రాత పూర్వకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించాలని సూచించారు. నేడు వివిధ పార్టీలు అందించిన వినతులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల కమీషన్ కు నివేదించడం జరుగుతుందని డూప్లికేట్ ఓటర్ల తొలగింపు చేపట్టామని వివరించారు. ఈ సమావేశంలో సి.పి.ఎం , సి.పి.ఐ. ప్రతినిధులు వినతులను అందించారు. మార్చి 13 న జరగనున్న పోలింగ్ సమయం వల్ల 1200 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలకు అనుబంద పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వివరించారు.

ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, ఆర్.డి.ఓ.లు గూడూరు కిరణ్ కుమార్, సూళ్ళురుపేట చంద్రముని, శ్రీకాళహస్తి రామా రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండ రామిరెడ్డి, శ్రీనివాసులు, ఎ.ఈ.ఆర్.ఓ. లుగా ఉన్న తహశీల్దార్లు గూడూరు లీలారాణి, సూళ్ళురుపేట రవి కుమార్, వెంకటగిరి పద్మావతి, చంద్రగిరి శిరీష , తిరుపతి వెంకటరమణ , శ్రీకాళహస్తి జరీనా, సత్యవేడు సుబ్రహ్మణ్యం, ఈ.డి.టి. లు గూడూరు శిరీష, సూళ్ళురుపేట మస్తానయ్య, వెంకటగిరి అర్చన, చంద్రగిరి మోహన్ రెడ్డి , శ్రీకాళహస్తి ఉషారాణి, సత్యవేడు రవిచంద్ర,
రాజకీయ పార్టీల ప్రతినిధులు బహుజన సమాజ్ పార్టీ శశి కుమార్, భారతీయ జనతా పార్టీ దయాకర్ రెడ్డి, సి.పి.ఐ. మురళీ, సి.పి.ఐ.ఎం. నాగరాజు, వై.ఎస్.ఆర్.సి.పి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *