విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2002 నాటికి రిజిస్ట్రేషన్ అయిన ఆటోలలో డీజిల్ ఆటోలు 529 సిఎన్జి ఆటోలుగా మార్చుకోకుండా ఇంకను ఉన్నాయని వాటిని ఈ నెలాఖరులోపు దరఖాస్తులు చేసుకొని, పాత ఆటోల స్థానంలో కొత్త సిఎన్జి ఆటోలుగా మార్చుకోవాలని డిటిసి యం పురేంద్ర కోరారు.
స్థానిక బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయంలో బుధవారం నాడు డిటిసి యం పురేంద్ర ఒక ప్రకటనను విడుదల చేశారు. డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ 2002, సెప్టెంబర్ నాటికి విజయవాడ నగరం పరిధిలో 8600 ఆటోలకు నియంత్రిస్తూ ప్రభుత్వం జీ. ఓ 155 ను విడుదల చేసిందని, వాటిలో పేర్కొన్న ఆటోలు 8071 ఇప్పటికే కొత్త సిఎన్జీ ఆటోలుగా అనుమతులు తీసుకొని తిరుగుచున్నాయని డీటీసీ అన్నారు. ఇంకను సుమారు 529 డీజిల్ ఆటోలు కొత్త సిఎన్జీ ఆటోలుగా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నదని, అటువంటి ఆటోలకు సిఎన్జీ ఆటోలు కొనుగోలుకు అనుమతులు ఇస్తున్నామని, విజయవాడ నగరంలో తిరుగుటకు అనుమతి ఉంటుందని ఆయన అన్నారు. 529 డీజిల్ ఆటోల జాబితాను కార్యాలయం నోటీసు బోర్డ్ లో అతికించడమైనదని, వాటిలో ఉన్న ఆటోలకు మాత్రమే కొత్త సిఎన్జీ ఆటోల కొనుగోలుకు అనుమతులు ఇస్తున్నామని పురేంద్ర తెలిపారు.
Prajavartha Online Telugu News