విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడానికి వైజ్ఞానిక సదస్సులు ఉపయుక్తంగా ఉంటాయి

-ఆధునిక కాలంలో సాంకేతికతను మంచి పనులు కోసం సద్వినియోగం చేసుకోవాలి
-కమీషనర్ కె. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆధునిక పోకడలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచన, విషయ పరిజ్ఞానం పై తార్కిక వివేచన పెంచేలా సైన్స్ బోధన ఉండాలని నగర పాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు.

బుధవారం స్థానిక ఆల్కట్ గార్డెన్స్ లో గల శ్రీసత్య సాయి గురుకులంలో రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ కే. దినేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే శాస్త్ర విజ్ఞానం పట్ల మక్కువ పెంచుకున్న వారు ఉన్నత స్థాయి శాస్త్ర వేత్తలుగా తయారు అవుతారన్నారు. కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి వి శ్యామ్ వినూత్నంగా రూపొందించిన బోర్డ్ పై నీటిని వెదజల్లగా .. సైన్స్ ఫెయిర్ ప్రారంభం అని రావడం గమనించి కమీషనర్ ముచ్చట పడ్డారు. నేడు ఆధునిక మానవుని జీవన శైలిలో నిత్య జీవితం లో సైన్స్ ఒక భాగం అయిందన్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను కమిషనర్ తిలకించారు.

జిల్లా విద్యా శాఖాధికారి ఎస్. అబ్రహాం మాట్లాడుతూ గత డిసెంబర్ లో జరిగిన మండల స్థాయి పోటీల్లో ప్రధమ స్థానం పొందిన ప్రాజెక్టులు, జిల్లాలోని 19 మండలాల నుండి ఈ జిల్లా స్థాయి ప్రదర్శనకు మొత్తం 95 ప్రాజెక్టు లు ఎంపిక అవ్వడం జరిగిందనీ, అవి నేడు జిల్లా స్థాయి ప్రదర్శనకు వచ్చాయన్నారు.

మొత్తం 5 అంశాలు..
1.పర్యావరణ హితం
2.ఆరోగ్యం..పరిశుభ్రత
3.సాఫ్ట్ వేర్..ఆండ్రాయిడ్ ఆప్ లు
4.పర్యావరణం..వాతావరణ మార్పులు
5.గణితభావన మోడల్స్..

ఒక్కొక్క థీమ్ నుండి రెండు చొప్పున మొత్తం 10 ప్రాజెక్టు లు రాష్ట్ర స్థాయి కి ఎంపిక అవుతాయన్నారు.

ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి నుండి డాక్టర్ టి.సుజాత,హెచ్ దేవరాజు,డాక్టర్.బి మల్లికార్జున,జి.శేఖర్ బాబు,సి హెచ్ సంజీవ కుమార్ లు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యా శాఖాధికారి ఎమ్ . తిరుమల దాస్, అర్బన్ రేంజ్ డి ఐ. బి. దిలీప్ కుమార్, రూరల్ ఎమ్ ఈ ఓ – ఎ.తులసీదాస్, సత్య సాయి గురుకులం కరెస్పాండెంట్ ఎ. శ్యాం సుందర్, ప్రిన్సిపాల్ కె.గురవయ్య , జిల్లా సైన్స్ అధికారి జి.వి ఎన్.ఎస్ నెహ్రు, జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ కె. సతీష్ బాబు, కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, ఎస్.ఎల్ వి రమేష్ ,గణపతి, వెంకట రమణ, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *