రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మీలోని స్మృజనత్మకత, ఆలోచన విధానం , నిజాయతీ నిబద్దత లో మాతో సమానంగా ఉన్నారనండంలో ఎటువంటి సందేశం లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రత్యేక మహిళ జైల్ ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, ఇతర మహిళా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నీటిని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని మీరు ప్రదర్శించిన కథంసము నేటి సమాజం ఆలోచన చేసే విధానం ఉందని అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల మీరు ఇక్కడ ఉన్నారు కానీ, బయట ఉన్న మాకంటే మిన్నగా మీలో ప్రతిభ కలిగిన ఉందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు అని పేర్కొన్నారు. ప్రతి నిత్యం జైల్ ముందు నుంచి కలెక్టరేట్ కు వెళ్ళే సందర్భంలో మీ గురించి ఆలోచన చేస్తుంటాను అని పేర్కొన్నారు. కలెక్టర్ గా ఎంతో వత్తిడి లో పని చేయవలసి ఉంటుంది. వెలుగు చీకటి లాగా, సూర్యుడు, చంద్రుడు లాగే మనం నిత్యం మంచి చెడుల మధ్య జీవితాన్ని గడప వలసి ఉంటుందన్నారు. చేసిన చిన్న తప్పు వల్ల మీరు ఇక్కడ ఉన్నారన్నారు. ఇక్కడ గడిపిన రోజులను సద్వినియోగం చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మీరు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆలోచన రేకెత్తించాయని కలెక్టర్ అభినందించారు. మహిళా ప్రత్యేక ఖరాగారం పర్యవేక్షకురాలు సిహెచ్. వసంత కుమారి మాట్లాడుతూ, 1994 లో మహిళల కోసం ప్రత్యేక కారాగారం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. అనుకోని పరిస్థితుల్లో తప్పు చేసిన వారిలో పరివర్తన చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారిలో ఆత్మ విశ్వాసం నమ్మకం పెంచే విధంగా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఏదైనా తప్పు చేస్తే పురుషులకు, మహిళలకు విధించే శిక్షలు ఒకేలా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ నుంచి విడుదల అయ్యే ఖైదీలు సత్ప్రవర్తన కలిగి బయటకు వెళ్లడం కోసం ఇక్కడ అధికారులు, సిబ్బంది పని చేస్తున్న ట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ రజనీ, డిప్యూటి డి ఎమ్ హెచ్ వో డా ఎన్. వసుంధర, డి ఎల్ డి వో పి. వీణా దేవి, ఇతర అధికారులు, మహిళా ఖైదీలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పలు సందేశాత్మక కథాంశాలు ప్రదర్శించారు.
Prajavartha Online Telugu News