తిరుపతి పరిధిలోని ఆరోపణలు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులు నియామకం

-ఎం.ఎల్.సి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు
-ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి పట్టణ పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో గత కొన్ని రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని వివిధ రాజకీయ పార్టీల నుండి, సి ఈ ఓ కార్యాలయం నుండి పిర్యాదులు అందిన నేపథ్యంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే దిశలో చేపట్టిన అనేక చర్యలలో భాగంగా తిరుపతికి చెందిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక అధికారులు గా సీనియర్ అధికారులను ఎన్నికల ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వెలుపల పర్యవేక్షించేందుకు నియమించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణ రెడ్డి తెలిపారు.

ఆదివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ తిరుపతి పట్టణ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో నిష్పాక్షికంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిబంధనల మేరకు ఎంఎల్ సి ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ కేంద్రం వెలుపల ఉండి పర్యవేక్షించేల 16 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందనీ, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రత్యేక అధికారులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లరాదని తెలిపారు. పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.

వచ్చిన ఓటరు సదరు ఓటరు జాబితాలో ఉన్నవారై ఓటర్ స్లిప్ తో పాటు, ఎపిక్ కార్డు లేదా ఎన్నికల సంఘం తెలిపిన పది గుర్తింపు పత్రాల లోని ఏదేని ధృవీకరణ పత్రం రూఢీ చేసుకుని పి.ఓ ఓటింగ్ కు అనుమతి ఇస్తారని అలాంటి ఓటరును అనుమతించాల్సి ఉంటుందని అన్నారు.

పై తెలిపిన పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశామని, పోలింగ్ స్థానం వెలుపల లోపల వీడియోగ్రఫీ, అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. దొంగ ఓటు వేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే కేసు నమోదు చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతి యుత వాతావరణంలో ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని రకాల చర్యలు చేపట్టామని, ఎలాంటి అనుమానాలు భయాందోళనలకు తావు లేకుండా ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, ఎన్నికల విధులు కేటాయించ బడిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *