1210వ ఆరోగ్య సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య నర్సింగ్ హెమ్లో “ఎండోమెట్రియోసిస్ ” అంశంపై గురువారం జరిగిన 1210వ ఆరోగ్య సదస్సు వివరాలు “ఎండోమెట్రియోసిస్ అనేది మహిళలకి సంబంధించిన సామాజిక ఆరోగ్య సమస్య. భారతదేశంలో 42మిలియన్ల మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే బాధకి గురై ఉన్నారు. ఈ వ్యాధి గురించి అవగాహనా రాహిత్యం అనేక అరిష్టాలకి మూలం అవుతుంది” అని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డా||వి. పద్మజ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హెూమ్లో డా॥సమరం అధ్యక్షతన గురువారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె “ఎండోమెట్రియోసిస్” అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయంలో ఉండవలసిన టిష్యూ పార. అది ఉండవలసిన చోటే కాకుండా గర్భాశయం ప్రక్కన ఉన్న ట్యూబుల్లోకి, అండాశయాల్లోకి, ప్రక్కన ప్రదేశాల్లోకి వ్యాపిస్తుందన్నారు. ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళల్లో మెన్సస్ సమయంలో పొత్తికడుపులో బాగా నొప్పి ఉంటుందన్నారు. మెన్సస్ అయిపోయినప్పటికీ ఆ నొప్పి కొనసాగుతుందన్నారు. స్త్రీ పురుషుల లైంగిక కలయికలో కూడా మహిళకి పొత్తి కడుపులో నొప్పి అనిపిస్తుందన్నారు. అంతేకాకుండా జీర్ణాశయ ప్రేగుల కదలికలోనూ, మూత్ర విసర్జనలోనూ నొప్పి అనిపిస్తుందన్నారు. బహిష్టు సమయంలో ఎక్కువ రక్తస్రావం కలిగిస్తుందన్నారు. సంతానలేమికి ఎండోమెట్రియోసిస్ ఒక ప్రధాన కారణం అన్నారు. ఎండోమెట్రియోసిస్ వల్ల మహిళ రోజువారీ పని చేసుకోవడంలో ఎంతో బాధపడుతుందన్నారు. నీరసం, అలసట, ఆందోళన, డిప్రషన్ వంటివి ఆమెను చాలా ఇబ్బంది పెడతాయన్నారు. ఎండోమెట్రియోసిస్ ప్రాణాంతక వ్యాధి కాదు కానీ స్త్రీ దినవారీ కార్యక్రమాలని సుఖమంతంగా చేసుకోకుండా బాధామయం చేస్తుందన్నారు. ప్రతి మహిళ ఎండోమెట్రియోసిస్ గురించి అవగాహన కలిగి ఉండి అటువంటి బాధ తలెత్తినప్పుడు వైద్యుడిని సంప్రదించాలన్నారు. బాధలు తాత్కాలికంగా విముక్తి కలగడానికి మందులు ఉంటాయన్నారు. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఎండోమెట్రియోస్స్కి చాలా వరకు ఉపశాంతి కలిగించవచ్చన్నారు. ఎండోమెట్రియోసిస్ తక్కువుగా ఉన్నవాళ్ళు డాక్టరు సలహా మేరకు హర్మోన్ల మాత్రలు తీసుకోవాలన్నారు. రోజువారీ వ్యాయామం, మంచి పౌష్టికాహారం కావాలన్నారు. ఎండోమెట్రియోసిస్ ప్రధానంగా 20-30సంవత్సరాల వయస్సువారిలో ఎక్కువుగా కనబడుతుందన్నారు. ఎండోమెట్రియోసిస్ గురించి ప్రతి మహిళకి అవగాహన అవసరం అన్నారు. డా॥మారు వందన సమర్పణ చేసారు. సదస్సులో పాల్గొన్న అనేకమంది పలు ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *