-ఆధునాతన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన వరల్డ్ బ్యాంకు బృందం..
-వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే సంతృప్తి వ్యక్తం చేశారు.
వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకుల ప్రతినిధుల బృందం, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావులతో కలిసి మంగళవారం విజయవాడ భవాని పురంలోని వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ కోరారు.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె. నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునాతన మౌలిక వసతులు వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను మందులను అందజేయడం పట్ల వరల్డ్ బ్యాంకు బృందం సంతృప్తిని వ్యక్తం చేశారు.ఆయుష్మాన్‌భారత్ వెల్‌నెస్ కేంద్రాలు డా. వైఎస్సార్ పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు కమీషనర్ జె. నివాస్ బృందానికి వివరించారు. గ్రామ స్థాయిలో వాలంటీర్లు, ఆశా వర్క్‌ర్లు, ఎఎన్‌యంలు ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి రోజు జనరల్ ఫిజీషియన్ ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్థారణ చేస్తున్నారని అనంతరం వ్యాధికి సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా వైద్య చికిత్సలను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకేంద్రాలలో కోవిడ్ టెస్ట్‌లను కోవిడ్ వ్యాక్సిన్‌లను పిల్లలకు సాధారణంగా అందించాల్సిన టీకాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మందుల షాపులను ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను సిద్దంగా ఉంచడం జరిగిందన్నారు. రోగ నిర్థారణకు సంబంధించి సుమారు 60 పైగా టెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలతో మ్యాపింగ్ చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే చర్యలు తీసుకుంటున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె. నివాస్ వరల్డ్ బ్యాంకు బృందానికి వివరించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 48 డా. వైఎస్సార్ అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 257 విలేజ్ హెల్త్ సెంటర్లు, 6 జనరల్ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్యామిలీ కాన్స్‌ప్ట్ విధానం ద్వారా ఇప్పటివరకు 1 లక్షల 83 వేల 300 మందికి వైద్యం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సహాయం అందించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు వరల్డ్ బ్యాంకు దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా అందిస్తున్న సేవలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులలో పొందుపరచి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
డా. వైఎస్సార్ అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిశీలనలో వరల్డ్ బ్యాంకు బృందం సభ్యులు ట్రైనా ఎస్ హక్యూజున్‌కో ఒనీషి భవనా భాటీయా ఆడ్రౌవ్ డి గుడ్‌లాండ్ సుధీప్‌మెంజుంజర్ కార్తీక్ పెంటాల్ అమీత్ నాగరాజు, లక్ష్మి శ్రీపాద, కృష్ణసాగుల వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని, క్షయ వ్యాధి నివారణ అధికారి డా. ఉషారాణి,డిప్యూటి డియంహెచ్‌వో డా. నళిని దేవి, ఎస్‌హెచ్‌వో నర్సింగ్ డా. నాయక్, డిపియంవో డా. నవీన్, వైద్య అధికారి రిమ్‌సా సానియా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News