పేద, నిరుపేదలకు అందించే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు పై సమీక్ష

-జిల్లాలో 11 ఆసుపత్రుల నుంచి రూ.14.22 లక్షలు వసూలు
-ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులతో సమావేశం
-70 ఫిర్యాదులపై కమిటీ సమావేశం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే సేవలు నిమిత్తం అనధికార రుసుములు వసూలు చేసిన పదకొండు ఆసుపత్రుల నుంచి రూ.14.22 లక్షలు ఆపరాధ రుసుం వసూలు చేసినట్లు  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు.

స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో  వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు పై రెండవ జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన భావన ఆరోగ్యశ్రీ పథకం అమలులో మెరుగైన వైద్య సేవ ప్రజలకు అందించడమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఈ విషయంలో ఆరోగ్య సేవలు అందించే క్రమంలో రోగుల నుంచి అనధికార వసూళ్లు, సేవాలోపం తదితర వాటిపై ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజలకు అందించే వైద్య సేవలు విషయంలో ఎటువంటి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు నిర్లక్ష్య వైఖరి వహించినా సహించే ప్రసక్తే లేదన్నారు. నగదు వసూలు చేయడం, వైద్య సేవల్లో లోపాలు, స్కానింగ్ ఫీజ్ వసూలు, రోగిని చేర్చు కోవడానికి తిరస్కరించడం తదితర వాటిపై ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు.  ఫిబ్రవరి 7 వ తేదీన జరిగిన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 11 ఆసుపత్రులకు రూ.14.22 లక్షల మేర అపరాధ రుసుం విధించి వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే తరహా ఫిర్యాదులు పునరావృతం అయితే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

క్రమ శిక్షణ కమిటీ ముందు ఈరోజు 70 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో సచివాలయాల ద్వారా 42, ఐ వి ఆర్ ఎస్ ద్వారా 28 వచ్చాయని మాధవీలత తెలిపారు. ఫిర్యాదులలో ఎక్కువ శాతం టెస్ట్ లకు సంబందించినవి కాగా, చిన్న చిన్న మొత్తాలను వసూలు చేసినవి (₹400-600) కూడా ఉండడం గుర్తించామని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యకుండా వైద్య సేవలు అందించేలా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశం లో సమన్వయ కర్త గా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డాll  పి.ప్రియాంక, డి.ఎం.హెచ్.వో డా కె. వెంకటేశ్వర రావు, డిసిహెచ్ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం, ప్రతినిధులు హాజరయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు
ప్రవేటు ఆసుపత్రులు 39

ప్రభుత్వ ఆసుపత్రులు 36

డెంటల్ ఆసుపత్రులు..15

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *