రాజమండ్రి డిపోని సందర్శించిన ఈ డి జివి రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక రాజమండ్రి బస్ స్టేషన్ మంగళవారం తనిఖీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ పి ఎస్ ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్ధము ప్రయాణికులకు వీలుగా ఉండేలాగా ఆర్టీసి బస్సు సర్వీసులను తిప్పాలని సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న నాలుగు డిపోల, డిపో అధికారులతో, ఏటీఎం (కమర్షియల్) , ఇతర జిల్లా అధికార్లతో సమావేశం నిర్వహించి ఆయా డిపోల ఆదాయ వనరులను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశలో తగు సూచనలు ఇవ్వడం, డిపో అధికారుల యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోని వాటి పరిష్కారం కోసం సూచనలు చేశారు. రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరములో బాగా పనిచేసి ఆదాయం పెంచాలని, అలాగే కార్గో ఆదాయం కూడా పెంచాలని సూచించారు. ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకంగా వుంటూ వారిని ఆకట్టుకొనే విధంగా బస్ సర్వీసులు నడపాలని స్పష్టం చేశారు. పర్యటన లో భాగంగా రాజమండ్రి బస్టాండ్ నందు కొత్తగా వేస్తున్న రోడ్డునకు శంకుస్ధాపన, మహిళల విశ్రాంతి గదుల ప్రారంభోత్సవం, సరుకు రవాణ భవనములో అదనముగా నిర్మించిన గదులను ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారిణి కే.షర్మిల అశోక్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *