8వ తేదీన “రన్ ఫర్ జీసస్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 8 వ తేదీన జరగనున్న ‘రన్ ఫర్ జీసస్‘ కార్యక్రమం జయప్రదం చేయాలని క్రైస్తవ ఐక్యవేదిక మరియు బాప్టిస్ట్ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణపై నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, నాయకుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్స్ అల్లూరి విశ్వప్రసాద్, ఫాదర్ మువ్వల ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఏసుప్రభు పై విశ్వాస పటిమను పెంపొందింప చేయటానికి ఇటువంటి ఐక్య కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. నగరంలో ఇప్పటివరకు 11 సార్లు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీన జరగబోయే 12వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం భారతదేశంలో 400 పట్టణాల్లో ఒకే సమయానికి ఒకే రోజు ఆయా స్థానిక క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షనీయమని పేర్కొన్నారు. నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 8వ తేదీన జరగబోయే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు సెయింట్ పాల్స్ కేతడ్రాల్ గ్రౌండ్లో ప్రారంభమై సిద్ధార్థ పాలి క్లినిక్, మదర్ తెరిసా సర్కిల్, శిఖామణి సెంటర్ మీదగా సి.ఎస్.ఐ సెయింట్ పాల్స్ బసిలిక చర్చ్ గ్రౌండ్ వరకు కొనసాగి అక్కడ ముగుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కనివిని ఎరిగిన రీతిలో జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాండ్రు సుధాకర్, సిరిపురపు గ్రిటన్, అమృతపూడి కార్తీక్, ఐ కరుణానిధి, బెల్లంకొండ శివాజీ రాజు, సుదర్శన్, శీలం ప్రవీణ్, జయకుమార్, కరుణబాబు, శరత్, పాస్టర్ పి శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *