సేంద్రియ ఆహారంతో ‘‘పండుగ భోజనం’’ రెస్టారెంట్‌ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సేంద్రియ ఆహార భోజన ప్రియులకు అందరికి అందుబాటులో ఉండే విధముగా ‘‘పండుగ భోజనం’’ రెస్టారెంట్‌ను ప్రారంభించారని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీలు తెలిపారు. సోమవారం సత్యనారాయణపురం, శారద కాలేజ్‌ జంక్షన్‌ బీ.ఆర్‌.టీసీ.రోడ్డు దగ్గర ‘‘పండుగ భోజనం’’ సేంద్రియ ఆహార భోజనశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు కూరగాయలు దాచుకోవడానికి విద్యుత్‌, ఐస్‌ లేకుండా కేవలం నీటి నిల్వ ద్వారా సరికొత్త విధానం ద్వారా సుమారు వారం రోజులు నిల్వ వుండేలా తయారు చేసిన ఫ్రిజ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల రుచులతో పూర్తిగా సేంద్రియ ఆహారం ఉండేటట్లు ఈ హోటల్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ రెస్టారెంట్‌ దినదినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని బ్రాంచీలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎటువంటి కెమికల్స్‌ లేకుండా సేంద్రియ పద్ధతులలో పండిరచిన పంటలు మార్కెటింగ్‌ చేసుకోవడం తెలియక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి సమయంలో సేంద్రియ పంటల ద్వారా పండిరచే కూరగాయల ద్వారా తయారుచేసే ‘‘పండుగ భోజనం’’ లాంటి రెస్టారెంట్లు మరిన్ని రావాలన్నారు. రైతులు పండిరచిన సేంద్రియ పంటలు ద్వారా తయారుచేసే వంటకాలు అందించే ‘‘పండుగ భోజనం’’ నిర్వాహకులు పిళ్ళా జగదీష్‌, ఖైతేపల్లి సురేష్‌లు మాట్లాడుతూ తమ హోటల్‌ను మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ హోటల్‌లో కెమికల్‌తో పండిరచిన కూరగాయలు కాకుండా సేంద్రియ పద్ధతులలో ఎరువుల ద్వారా పండిరచిన స్వచ్ఛమైన కూరగాయల ద్వారా అనేక రకాలైన వంటకాలు అందిస్తున్నామన్నారు. అలాగే ఆర్గానిక్‌ చికెన్‌తో కూడా వంటకాలను అందిస్తామన్నారు. రైతులను ప్రోత్సహించి ప్రజలకు ప్రకృతి సిద్ధంగా వుండి ఆరోగ్యంగా వుండే ఆహారాన్ని అందించాలని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *