మూడవ ఏషియన్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ పోటీలలో గెలుపొందిన తిరుపతి జిల్లా విద్యార్థులను అభినందించిన కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత మార్చి నెల 29 మరియు 30 వ తేదీలలో శ్రీ మనోహర్ పారికర్ ఇండోర్ స్టేడియం గోవా నందు నిర్వహించిన మూడవ ఏషియన్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో తిరుపతి జిల్లా నుండి 8 మంది 12, 13 మరియు 14 సం. లోపు విద్యార్థులు పాల్గొని 10 బంగారు పథకాలు మరియు ఆరు వెండి పథకాలను కాటా మరియు కుమటే కరాటే పోటీలలో గెలుపొంది పతకాలను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి విద్యార్థులను మరియు కోచ్ ను అభినందించారు.

సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్ నందు విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ FSSKAI కరాటే అకాడెమీ, రాజగోపాల పురం, సత్యవేడు నందు కరాటే శిక్షణ పొందిన 12 సం.ల లోపు, 13 సం.ల లోపు, మరియు 14 సం లోపు విద్యార్థులు గత నెల మార్చి 29 మరియు 30 వ తేదీలలో శ్రీ మనోహర్ పారేకర్ ఇండోర్ స్టేడియం గోవా నందు నిర్వహించిన మూడవ ఏషియన్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో 7 దేశాలతో 2000 మందితో పోటీ పడి మన భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నుండి 8 మంది విద్యార్థులు 10 బంగారు పథకాలు మరియు ఆరు వెండి పథకాలను కాటా మరియు కుమటే కరాటే పోటీలలో గెలుపొంది కైవశం చేసుకోవడం ఎంతో గర్వకారణం అని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులను ఆశీర్వదించి వారికి అభినందనలు తెలిపారు. FSSKAI కరాటే అకాడమీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ కన్నయ్య ను కలెక్టర్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ వారితో గ్రూప్ ఫోటో దిగారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థుల వివరాలు ఏ మోక్షిత, ఏ తనుయా, సి గీతిక (13 సం. లోపు), ఎం మానస్వి, ఎం దీక్షి, కే కౌశిక్ వర్మ, హేమ సుందరం, సి గీతిక (14 సం. లోపు) గా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *