” ఫెర్మెంటేషన్ యూనిట్ ” స్థాపన కోసం ప్రభుత్వ సబ్సిడీ 35 శాతం

-కోకో సాగు లో అంతర్ పంట సాగు చేపట్టాలి
-ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ 7893347474 సంప్రదించండి…
-నితిన్ కార్డియా
-సుభాష్ కిరణ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొబ్బరి తోటల్లో అంతర పంటగా, కోకో మొక్కలు పెంచడం ద్వారా ఆ పంట కి మెరుగైన ధర లభింప చేసే విధానం లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అడుగులు అనుసరణీయం అని ప్రముఖ చాక్లెట్ టేస్టర్ నితిన్ కార్డియా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లో రెండు రోజుల పాటు సి టి ఆర్ ఐ కార్యాలయ సమావేశ మందిరంలో రెండు రోజులు పాటు నిర్వహించిన సదస్సు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కోకో వేల్యూ చైన్ మీద నిర్వహించిన సదస్సు ప్రాధాన్యత సంతరించుకునే దిశలో ఫలవంతం గా నిర్వహించారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలకి చెందిన 100 కి పైగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు హాజరు కావడం శుభ పరిణామం గా వక్తలు పేర్కొనడం జరిగింది.

ఈ సదస్సులో భారత దేశపు మొట్టమొదటి చాక్లెట్ టేస్టర్ అయిన .. నితిన్ కార్డియా అంతర్జాతీయంగా ఎన్నో చాక్లెట్ కంపెనీలకి సేవలందించిన వారు కోకో సాగు లో మరియు చాక్లెట్ తయారీ లో తమకున్న అపారమయిన అనుభవాన్ని రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ కార్డియా మాట్లాడుతూ మన కోకో మొక్కలకి, కోకో ఎగుమతుల్లో పేరెన్నికగన్న, ఘనా, దక్షిణ ఆఫ్రికా మొదలగు ఎన్నో దేశాల మొక్కలకున్న నాణ్యత ఉంది కానీ మన రైతులు ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు వాటి నుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే గింజలు (కోకో బీన్స్) తయారు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న రైతులకి మెరుగైన ఉత్పాదక పద్ధతుల మీద అవగాహను ఉండకపోవడం ఒక కారణం ఆయన పేర్కొన్నారు. అయితే రెండో కారణం మెరుగయిన ఉత్పాదన చేసిన మెరుగయిన ధర దొరకదేమోనని అపోహ ఉండటం కూడా కారణంగా పేర్కొన్నారు. ఈ భయాలని తొలగించే క్రమంలో రైతులను ఉద్దేశిస్తూ నితిన్ రైతు కొంచెం సమయం, శ్రమ పెట్టుబడి పెట్ట గలిగితే నాణ్యమయిన బీన్స్ తయారు చెయ్యగలరని తెలిపారు. కిలో కి రు.70 నుంచి రు.90 రూపాయలు వరకు అదనంగా లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇంకొంచెం ముందరకి ఆలోచించి చాక్లెట్ ప్రాసెసింగ్ లోకి కూడా వెళ్లగలిగితే చాక్లెట్ రు.1800 రూపాయల వరకు ధర పలుకుతుందని భరోసా ఇచ్చారు. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం ఉండదన్నారు.

16 టన్నుల నాణ్యమయిన బీన్స్ ఉత్పత్తి చేసే “ఫెర్మెంటేషన్ యూనిట్ ” ఏర్పాటు కు రు.28 లక్షలు ఖర్చు కాగా ఇందులో 35 శాతం ప్రభుత్వ రాయితీ అందించగా మిగిలినది పది శాతం రైతు పెట్టుబడి కాగా, మిగిలిన శాతాన్ని బ్యాంకు రుణ సదుపాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న వారు కనీస స్థాయి లో రూ. 10 లక్షల్లో చాకోలెట్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు.

ఈ సదస్సుకి హాజరు అయిన ప్రధానమంత్రి ఫార్మా లైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసంగ్ ఎంటర్ ప్రైజెర్స్ ( PMFME) పథక సంచాలకులు సుభాష్ కిరణ్ మాట్లాడుతూ రైతులకి ఈ విషయములు ఏవిధమయిన ఆ మరియు సాంకేతిక తోడ్పాటుని అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని 35% రుణ ఆధారిత సబ్బిడి అందించే ఏర్పాటు ఉందని తెలియజేసారు. దీనికి సంబందించిన శిక్షణా తరగతులు కూడా త్వరలో నిర్వహిస్తామని తెలియజేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ మన రాష్ట్రం లో ప్రస్తుతం ఉత్పత్తి కాబడుతున్న కోకో జీన్స్ కేవలం 10 వేల మెట్రిక్ టన్నులు లని, కానీ కాడ్బరీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 50 వేల మెట్రిక్ టన్నుల వినియోగించగలిగే యూనిట్ శ్రీసిటీ లో స్థాపించని ఎన్నో వేల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉందని, కాబట్టి మార్కెటింగ్ గురించి రైతు అసలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఈ సదస్సుకి SERP అడిషనల్ డైరెక్టర్ మహిత , జిల్లా హారికల్చర్ ఆఫీసర్ రాహ , సెర్ప్ జిల్లా సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది.

ఆసక్తి కలిగిన రైతులు, రైతు సంఘాల ఎవరయినా ఈ పద్దతుల గురించి, ప్రభుత్వ సహకారం గురించి మరింత సమాచారం కొరకు ఫుడ్ ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ కే.జె. మారుతీ ని ఈ నెంబర్ ద్వారా 7893347474 సంప్రదించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *