ఇంతియాజ్ ని మర్యాద పూర్వకంగా కలిసినజాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరపాలక పరిధిలోని సుబ్బారావు నగర్ లో స్థల వివాదం కు సంబందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన మేరకు, విచారణ అధికారిగా నియమించిన సేర్ప్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎమ్ డి ఇంతియాజ్ విచారణ నిమిత్తం గురువారం రాజమండ్రి రావడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా సుబ్బారావు నగర్ లో సంభందిత స్థలాన్ని పరిశీలించి ఇంతియాజ్ విచారణ చేపట్టడం జరిగింది. అంతకు ముందు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం లోని ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకున్న ఇంతియాజ్ వారిని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి , విచారణ నిమిత్తం ఇంతియాజ్ వారిని అనుసరించడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *