ఇంటి నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి

-మే నెలాఖరు నాటికి వంద శాతం ఇంటి నిర్మాణాలు గ్రౌండింగ్ చెయ్యాలి
-ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమంలో క్షేత్ర స్థాయి లో పర్యటన
-లబ్ధిదారుల ఇంటి గృహ ప్రవేశ, శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతృప్తి నిచ్చింది
-కలెక్టర్ కె. మాధవీలత

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వంత ఇంటి నిర్మాణం కోసం స్థలాలు పొందిన లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించి, ప్రభుత్వం అందచేసే ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు రక్త హీనత లేకుండా సమగ్ర పోష్టి కాహారాన్ని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం అనపర్తి నియోజక వర్గం కొంకుదురు, బలభద్రపురం గ్రామాల్లో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పర్యటించారు. అనంతరం కొంకుదురు పి.హెచ్.సి. లో గర్భిణి స్త్రీల తో సంభాషించి, ఐ సి డి ఎస్ అధవర్యంలో శ్రీమంతం నిర్వహించారు. తదుపరి కొంకుదురు, బలభద్రపురం హౌసింగ్ కాలనీ లో లబ్దిదారులతో మాట్లాడి, ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.

పౌష్టికాహరం పై గర్భిణిలను, బాలింతలకు అవగాహన కల్పించిన కలెక్టర్ :
రక్త హీనత వల్ల ఆరోగ్య కరమైన బిడ్డకు జన్మ ఇవ్వడం సాధ్యం కాదని, ప్రభుత్వం నిర్దేశించి, అందచేస్తున్న పౌష్టికాహరం ఖచ్చితంగా గర్భిణిలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా చెక్ అప్ చేయించుకోవాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అందచేస్తున్న పౌష్టికాహరం, నియమబద్ధంగా సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.  రక్తంలో హేమో గ్లోబిన్ 9.8 శాతం ఉన్నట్లు మహిళలు తెలపగా,  గర్భిణి లలో ఖచ్చితంగా రక్తం లో హేమో గ్లోబిన్  11 శాతం ఉండాలని అన్నారు.  ఈ సందర్శన లో డి ఎం హెచ్ వో డా కే. వేంకటేశ్వర రావు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలు త్వరితగతిన చేపట్టండి :
ఇంటి గృహప్రవేశం, శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కోరారు. కొంకుదురు లే అవుట్ లో 104 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వగా వంద ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించినట్లు అధికారులు వివరించారు. బలభద్రపురం లే అవుట్ లో 668 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకూ 340 ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మే నెలాఖరు నాటికి నూరుశాతం ఇంటి నిర్మాణాలు గ్రౌండింగ్ చెయ్యాలని స్పష్టం చేశారు. ఇంటి స్థలాలు మహిళలు పేరున ఇవ్వడం జరిగిందని, స్వయం సహాయక సంఘాలు ద్వారా అదనపు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కొంకుదురు గ్రామంలో సిరిపల్లి వెంకటలక్ష్మి, శ్రీనివాస్ దంపతుల నూతన ఇంటి గృహప్రవేశ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. దినసరి కూలీ గా పనులు చేస్తున్న శ్రీనివాస్ దంపతులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్ల మా స్వంత ఇంటి కల సాకారం అయిందని, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఎంతో భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

బలభద్రపురం లే అవుట్ లో ఇలపర్తి బాల, గంగారావు (పురోహితులు) దంపతుల ఇంటి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మరింత మంది స్ఫూర్తి పొంది ఇంటి నిర్మాణం పనులు చేపట్టాలని, దశల వారీగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తే ఆమేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు నేరుగా లబ్దిదారుల ఖాతా కు జమ చేస్తామని తెలిపారు.

పర్యటన లో అనపర్తి మార్కెట్ యార్టు చైర్మన్ సబ్బళ్ళి కృష్ణారెడ్డి,  రెడ్డి కార్పోరేషన్ డైరెక్టరు సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు), హౌసింగ్ డి ఈ సిహెచ్. వేణుగోపాల స్వామి, కొప్పవరం సర్పంచ్ కర్రి బులి మోహన్ రెడ్డి  స్థానిక నాయకులు  కొవ్వూరి సత్యనారయణ రెడ్డి , ఇళ్ళ నిర్మాణ లబ్దిదారులు, తదితరులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *