మే 16 జాతియ డెంగ్యూ నివారణ దినం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డెంగ్యూ వ్యాధి, కీటక జనిత వ్యాధులలో ముఖ్యభూమిక అయ్యి ఉందని “ఏఈఈఎస్” రకం దోమల ద్వార వపించునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో మే 16 న నిర్వహించనున్న జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గోడ ప్రతిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేడు ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విస్తరించి వున్నదన్నారు. మన జిల్లాలో గత సంవత్సరం 2022 లో 226 డెంగ్యూ కేసులు నమోదైనవని పేర్కొన్నారు. తగు సమయంలో వ్యాధి తీవ్రతను బట్టి ఆయా ప్రాంతలలో తగు నివారణ చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు.

మే 16 జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంలో భాగం గా ప్రజల్లో అవగాహన కోసం ప్రచార కరదీపిక మరియూ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావలెనని మరియు రాబోవు వర్షా కాలమును దృష్టిలోవుంచుకొని, మునిసిపల్ పంచాయితీ రాజ్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక లతో పని చేయమని ఆదేశించారు. ప్రజలు సామాజిక బాధ్యత గా ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాలలో వాడి పారేసిన ప్లాస్టిక్ తదితర వస్తువులు, నీటి తొట్టెలు , టైర్లు, కొబ్బరి బొండాలు దోమల పెరుగుదలకు ఆవాసాలు కావునా, వాటినీ వారానికి ఒకసారి విధిగా శుభ్రం బ చేసుకోవాలన్నారు. ఈ విషయాలను అధికారులు వివిధ సందర్భాలలో ప్రజలకి తెలియ చేయాలి అని ఆదేశించడం జరిగింది.

పై కార్య క్రమం లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వేంకటేశ్వర రావు, జిల్లా మలేరియా అధికారి జీ.వీర్రాజు, జిల్లా వైద్య విధాన పర్షిత్ హాస్పిటల్ సమన్వయ అధికారిణి డాక్టర్ ఏం .సనత్ కుమారి, స్థానిక మలేరియా సిబ్బంది , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *