-వచ్చే వారం లోపు ఉపాధి హామీ కూలీల హాజరు 125000 దాటాలి
-వచ్చే సెప్టెంబర్ నెల లోపు ఉపాధి హామీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో అంది పుచ్చుకోవాలి
-లేబర్ మొబిలైజేషన్, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ హార్టికల్చర్ లక్ష్యాలను అందిపుచ్చుకావాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఎంపిడిఓ లు, సహాయ పథక సంచాలకులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, ఈ సి లతో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సమీక్షిస్తూ కూలీల హాజరు శాతం పెరగాలని, హార్టికల్చర్ అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని వర్షాకాలం లోపు ఉపాధి పనులు వేగంగా జరిగేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులలో కూలీల హాజరు శాతం పెంచాలని, పని దినాలు పెరగాలని అన్నారు. వచ్చే వారంలోపు ఉపాధి హామీ కూలీల హాజరు 1,25,000 దాటేలా ఎంపిడిఓ లు పురోగతి సాధించేలా, గ్రామ పంచాయతీ వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత ఏపీఓ తదితర అధికారులతో సమీక్షించుకుని ప్రణాళికా బద్ధంగా పనిచేసి పురోగతి సాధించాలని అన్నారు. హౌసింగ్ నిర్మాణం, హార్టికల్చర్ పనులపై దృష్టి పెట్టి ప్రతి మండలంలోని అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఈ సెప్టెంబర్ వరకు మనకు ప్రతి మండలం వారికి కేటాయించిన లక్ష్యాలు తప్పకుండా సాధించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కూడా నిబంధనల మేరకు కవర్ అయ్యేలా గ్రామ పంచాయతీ వారీగా గుర్తించి వారికి పనులు కల్పించి పని దినాలు మెరుగ్గా ఉండేలా చేయాలనీ అన్నారు. దొరవారి సత్రం, కోట ఓజిలి, నాగలాపురం, తడ,నారాయణ వణం మండలాలు పేద ఎస్సీ ఎస్టీ పేద కూలీలకు ఎక్కువ మందికి పని కల్పించగలిగారని అన్నారు.
హార్టికల్చర్ ఈ సంవత్సరం 2023-24 కు గాను 5500 ఎకరాల లక్ష్యానికి గాను 1100 ఎకరాలు సాధించారని, మిగిలినది పూర్తి చేయడానికి ప్రతి మండలంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ( PMU ) ఏర్పాటు ద్వారా మండలంలో తాసిల్దారు, ఉద్యానవన అధికారి, వ్యవసాయ అధికారి, ఎస్ హెచ్ ఓ,ఈఓ, పిఆర్డీ తదితర మండల అధికారులు ఉంటారని వీరు సమన్వయంతో పని చేసి మండలంకు 100 ఎకరాలకు తక్కువ కాకుండా ఉద్యాన వన పంటలను, ఫ్లోరీ కల్చర్ ను ప్రోత్సహించి ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ తదితర వర్గాలకు చెందిన అర్హులైన అందరికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా యంత్రాంగం ఉద్యాన పంటలు వేసుకునే వారికి త్వరిత గతిన ఏపీ ఎంఐపి ద్వారా డ్రిప్ మంజూరు చేయడం జరుగుతుందని రైతులను ఇందుకు ప్రోత్సహించాలని, ఆగస్ట్ లోపు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం జరగాలని అన్నారు.
డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్ల వెంబడి రైతుల పొలంలో కొంత మేరకు పూల మొక్కల పంట, ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. కమ్యూనిటీ భూములు, పోరంబోకు స్థలాల్లో తాసిల్డార్లు, ఈఓపిఆర్డి, డియల్డి ఓ లు బాధ్యులుగా సమన్వయంతో కమ్యూనిటీ ప్లాంటేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా లో ప్రస్తుతం సరాసరి కూలీ రూ.260 ఉందని, కానీ ఉండాల్సిన సరాసరి కూలీ రూ.272 అనీ, దీనిని అందిపుచ్చుకుని సరాసరి కూలీ పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత మండలం ఏపిఓ బాధ్యులుగా దీనిని గ్రామ పంచాయతీ వారీగా సమీక్షించి సమయానుసారంగా ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో ఉపాధి హామీ కూలీ చెల్లింపులు సకాలంలో జరగాలని, నిబంధనల మేరకు సరాసరి వేతనం అందేలా చర్యలు ఉండాలని సూచించారు. జాబ్ కార్డుల ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు అస్సలు జరగడం లేదని, కూలీ చెల్లింపులు జరగడం లేదనే మాట ఉండరాదని అన్నారు. తిరస్కరించబడిన ట్రాన్సాక్షన్ల రీకన్సిలేషన్ పెండింగ్ ఉండరాదని అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కింద మంజూరు చేసిన పనులను సత్వరమే గ్రౌండింగ్ చేయాలని, పనులను సత్వరమే ప్రారంభించాలని ఆదేశించారు.
వాలంటీర్లు ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా నియోజకవర్గాల వారీగా సేవ మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర గా వారిని సత్కరించే కార్యక్రమం షెడ్యూల్ను స్థానిక ఎమ్మెల్యే వారి సమయం తీసుకుని రోజుకు రెండు సచివాలయాలకు తగ్గకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు తయారుచేసి పంపాలని ఆదేశించారు. ఫేజ్ 2 లో నియామకమైన సచివాలయ సిబ్బందికి పెండింగ్ ప్రొబేషన్ డిక్లరేషన్ కు చర్యలు చేపట్టాలని, యాంటిసిడెన్స్ వెరిఫికేషన్ కు ఎస్పీ వారికి ప్రతిపాదనలు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ సిపిఓ అశోక్ కుమార్ డి ఎల్ డి ఓ సుశీల దేవి ఆదిశేష రెడ్డి ఎంపీడీవోలు ఏపీవో ఏపీ డి లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News