విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ,ఎలక్ట్రాసిటీ కాలనీ నందు ప్రభుత్వం ద్వారా గడపగడపకు మన ప్రభుత్వం నిధులు15లక్షల రూపాయల మంజూరు కాగా బుధవారంనాడు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అంగన్వాడీ బిల్డింగ్ కిచెన్, స్టోర్ రూమ్, స్టెయిర్ కేస్ నిర్మాణలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేయడం జరిగింది.
సీఎం జగన్ సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అవినాష్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో అవినాష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. గడప గడప కార్యక్రమంలో అవినాష్ ద్రష్టికి అంగన్ వాడీ కేంద్ర సమస్యను టీచర్లు తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి అదనపు గదుల నిర్మాణానికి క్రషి చేశారని ఆమె కొనియాడారు. అభివ్రద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న అవినాష్ ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని ఆమె సూచించారు.
విజయవాడ నగర అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే వేగవంతం అయ్యింది అని వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ అధికార పార్టీ వాళ్ళు ఉండి కూడా విజయవాడ నగర అభివృద్ధి ని పట్టించుకోలేదు అని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు అని అన్నారు. గడపగడపకు నాయకులు వెళ్ళినప్పుడు ప్రజలు అవినాష్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చెపడుతూన్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతిపక్షాలు యాత్రల పేరుతో ఎన్ని నాటకాలు ఆడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారి సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వానికే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు కోలా ఉమా,అబ్దుల్ హన్నన్,విజయ్,పల్లీ రమేష్, ప్రసాద్, బాబూరారావు, సాంబశివరావు, మణి, చంటి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News