Breaking News

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర మేయర్ తో కలిసి రూ. 45.25 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే విజయవాడ నగర సమగ్రాభివృద్ధి సాధ్యమ‌ని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ కుందావారి కండ్రికలో రూ.45.25 లక్షల అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి శుక్రవారం ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించారు. గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం నగరాన్ని పూర్లి నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏ ఒక్క అభివృద్ధి పనికి నోచుకోలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్లలో డివిజన్లలో రూ. 4 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో రూ. 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు తెలియజేశారు. అలాగే రూ. 19.98 లక్షల నిధులతో గ్రామంలో రహదారులు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించుకోవడంతో పాటు రూ.5.29 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోరును ప్రారంభించుకున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో రామాలయం వీధి, బ్రహ్మం గారి గుడి పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పవర్ బోరును ప్రారంభించుకోవడం జరిగిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దీని ద్వారా గ్రామంలో సుమారు 350 కుటుంబాలకు త్రాగునీటి సమస్య తీరనుందని తెలియజేశారు. బోరు ద్వారా ఉదయం 8.30 గం.ల నుంచి మ.12.00 గం.ల వరకు., అలాగే మ.2.00 గం.ల నుంచి రాత్రి 7 గంటల వరకు నీటి సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని తెలియజేశారు. ఈ సదుపాయాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరారు. మరోవైపు రూ.3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి అనుమతులు రాగా.. త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాలకు కూడా అభివృద్ధిని పరిచయం ఘనత ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత పాలకులు శివారు ప్రాంతాలలో పర్యటించిన దాఖలాలే లేవని విమర్శించారు. కానీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజలకు ఎంత చేరువలో ఉంటున్నారనేది చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల రూపంలో తెలుస్తోందని మేయర్ అన్నారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న డివిజన్లను గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం పార్టీలకతీతంగా ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు ఇస్మాయిల్, ఎం.రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, జిల్లేల్ల శివశంకర్, మేడా రమేష్, కొక్కిలిగడ్డ నాని, చెక్క నరసింహారావు, అక్కిశెట్టి నారాయణ, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *