-ఉదయం నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకు 7,890 మంది అభ్యర్థులకు గాను 2,515 మంది.
-మధ్యాహ్నం నిర్వహించిన అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పరీక్షకు 7,955 మందికి అభ్యర్థులకు గాను 2,432 మంది హాజరు..
-జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరి సిద్ధార్థ మహిళ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 15,845 మంది అభ్యర్థులలో ఉదయం నిర్వహించిన పరీక్షకు7,890 మంది అభ్యర్థులకు గాను 2,519 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 7,955 మంది అభ్యర్థులకు గాను 2,432 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. నగరంలో 17కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షించామన్నారు. పరీక్షలకు నియమించిన 780 మంది ఇన్విజిలేటర్లు, 17 మంది వెన్యూ సూపర్వైజర్లు సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా పరీక్షను నిర్వహించిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఢిల్లీరావు అభినందనలు తెలిపారు.
పరీక్షల ఓవరాల్ ఇన్స్పెక్టింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, కస్టోడియన్ అధికారిగా వ్వవహరించిన డిఆర్వో కె. మోహన్ కుమార్, పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ద్వారా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్: డా.పి. సంపత్ కుమార్.
నగరంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బిషప్ హాజరయ్య కళాశాల పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ పరిశీలించారు.
నారాయణ జూనియర్ కళాశాల, కేబీసీ జిల్లా పరిషత్ హైస్కూల్, చైతన్య ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ స్కూల్ పరిష కేంద్రాలను సబ్ కలెక్టర్ అదితిసింగ్ పరిశీలించారు.
Prajavartha Online Telugu News