సోమవారం నుంచి టమాటా కేజీ రూ.50

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జూలై 3 సోమవారం నుంచి టమాటా కేజీ రూ.50 లకు రైతు బజార్ల ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో రేపటి నుంచి అన్ని రైతుబజార్ల లో కిలో రూ.50/-లకు సబ్సిడీపై టమాటా పంపిణీ కి మార్కెటింగ్ శాఖ ద్వారా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి టమాటా రావడం జరుగుతోందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని రైతు బజారు లో సబ్సిడీపై టమాటా అమ్మకాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించడం జరుగుతుందని జిల్లా మార్కెటింగ్ అధికారి సునీల్ కుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *