Breaking News

సూర్యుడు ఉదయించక ముందే తలుపుతట్టి పింఛన్లు అందించే ప్రభుత్వం-మంత్రి జోగి

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ఉద్దేశమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన పురపాలక సంఘంలో 4, 5, 6 వార్డులకు సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం స్థానిక షాదీ ఖానాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి లబ్ధిదారులకు ఆదాయ, కుల, వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తొలుత 4, 5, 6 వార్డుల పరిధిలో ఎంపికైన 25 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర పతకాలు, మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేసి శాలువలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వైయస్సార్ భరోసా కార్యక్రమం కింద సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి అవ్వ తాతలకు పింఛన్లు అందజేస్తున్న విషయం గుర్తు చేశారు. ఇంకా ఎవరైనా పింఛన్లు గాని ఇతర పథకాలు గాని అందనివారు ఉంటే అట్టి వారిని గుర్తించి వారి అర్హతల మేరకు అవసరమైన ధ్రువత్రాలు ఉచితంగా అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు చేయూత పథకం కింద ఏడాదికి 18,750 అందిస్తున్నామని ఇంకా ఎవరికైనా అర్హత ఉండి అందకపోతే అట్టివారికి అవసరమైన కుల ధ్రువీకరణ, ఆదాయ ధృవపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం కింద సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వారికి అవసరమైన 11 రకాలైన ధ్రువపత్రాలను ఉచితంగా అందించే కార్యక్రమం అన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ధ్రువపత్రాల మంజూరు చేయడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరక్కుండా విలువైన సమయం ఆదా అవుతుందన్నారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇది ఎంతో మంచి కార్యక్రమం అన్నారు పెడనలో 4,5,6 వార్డుల పరిధిలో 210 మందికి 325 ధ్రువపత్రాలు అందజేస్తున్నట్లు, వీటిలో 180 ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు కాగా 134 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో కే డి సి సి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఇంచార్జ్ ఎండి ఖాజా, ఫ్లోర్ లీడర్ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ మహేంద్ర, తాసిల్దారు మధుసూదన్ రావు, కౌన్సిలర్లు రెహంతున్నీసా, బాబూలాల్ తదితరులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *