-మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్దం
-టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరు పై దిశా నిర్దేశనం చేశాం
-మంత్రులు ఆదిమూలపు సురేష్, హోం మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 2 లక్షల 62 వేల మందికి టిడ్కో ఇళ్ళ పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభవృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు .
సోమవారం ఉదయం రాజానగరం నియోజకవర్గం పరిధిలోని జిఎస్ఎల్ సమీపంలోని ప్రవేటు సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన టిడ్కో పై హోం మంత్రి తానేటి వనిత , జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , టిడ్కో చైర్మన్ జే. ప్రసన్న కుమార్, ఎండి సిహెచ్. శ్రీధర్ లతో కలిసి పురపాలక మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పూరి గుడిసె లేకుండా అర్హులైన పేదలకు స్వంత ఇంటి కల సాకారం చేసే దిశలో ఒక్క రూపాయి తో రిజిస్ట్రేషన్ చేసి టిడ్కో గృహాలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. గత పాలకుల సమయంలో రూ.7 లక్షల ఇళ్లను అందించేందుకు పేదలపై రూ 6 లక్షల ఆర్థిక భారం వేశారని అన్నారు. మన జగనన్న ప్రభుత్వం ఆ ఆర్థిక భారం రూ.11 వేల కోట్లు భరించి 1,45,000 వేల మందికి ఒక్క రూపాయి తో స్వంత ఇంటి కల సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు సమీక్ష సమావేశం కొవ్వూరు, నిడదవోలు, రాజమహేంద్రవరం మునిసిపల్ పరిధిలో ఉన్న టిడ్కో గృహ లపై సమీక్ష చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా లో 2023 చివరి నాటికి 5 వేల టిడ్కో ఇంటి పత్రాలు పంపిణీ చేయ్యానున్నట్లు తెలిపారు. ఆ కాలనీల్లో పూర్తి స్థాయి లో త్రాగునీరు, రహదారులు, మురుగునీరు పారుదల కాలువలు, విద్యుత్, అనుసంధాన రహదారి వంటి సౌకర్యాల కల్పన కలుగ చేస్తామన్నారు. ఆ దిశలో అధికారులకు దిశా నిర్దేశనం చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు కాల పరిమితి నిర్దేశించినట్లు తెలియ చేశారు. ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్ళ ను అందించాలని లక్ష్యం కాగా 75 వేల ఇళ్లు అందించడం జరిగిందని, మిగిలిన 25 వేల ఇళ్లు ఈనెలలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఈ సమిక్షలో కొవ్వూరు పరిధిలోని టిడ్కో గృహాలపై సమీక్ష నిర్వహించామని, కేటగిరీ ఏ పరిధిలోని 240 ఇళ్లను ఒక్క రూపాయి తో లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కేటగిరీ సి లో ఉన్న 240 ఇళ్లకు గాను 165 మందికి బ్యాంకు రుణాలను మంజూరు చేసినట్లు, మిగిలిన వారికి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. టిడ్కో గృహ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వనిత పేర్కొన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి 90 శాతం పై నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ పెట్టిన పనులు, నిధులను తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి, బకాయిలు చెల్లించామన్నారు.
ఈ సమీక్షా సమావేశం లో కొవ్వూరు పురపాలక సంఘం చైర్ పర్సన్ బావన రత్న కుమారి, వైస్ చైర్మన్ లు మన్నే పద్మావతి, గండ్రోతు అంజలి దేవి, జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , టిడ్కో చైర్మన్ జే. ప్రసన్న కుమార్, ఎండి సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, టిడ్కో ఇంజనీర్లు పి. గోపాల కృష్ణ రెడ్డి, బి. శ్రీనివాస రావు, ఎం ఎస్ స్వామి నాయుడు, జీ. నాగేశ్వరి, కొవ్వూరు మునిసిపల్ కమిషనర్ బి. శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News