పెద్దేవం గ్రామంలో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత హాజరయ్యారు. సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా పెద్దేవం గ్రామంలో శ్రీ విజయ సాయిబాబా మందిరంలో ఆమె విశేష పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, నాయకులు మేళ తాళాలతో, ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని  హోంమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి హోం మంత్రిని శాలువతో సత్కరించారు. అనంతరం శివాలయంలో చాయ సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆ దేవుళ్ల చూపు ప్రజలందరి పై ఉండాలని మంత్రి ఆకాక్షించారు. గ్రామాభివృద్ధి అంశాలపై స్థానికులతో చర్చించి బాబా వారి ప్రసాదాన్ని హోం మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *