ఆగస్ట్ 13 నుంచి ఆగస్టు 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం  

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నామట్టి నాదేశం కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 9 నుంచి 15 వరకు చేపట్టిన కార్యక్రమంలో ఆగస్ట్ 13 నుంచి ఆగస్టు 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. జగదాంబ తెలిపారు.ఆదివారం స్థానిక వైటిసి డ్వామా కార్యాలయం ప్రాగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పి. జగదాంబ మాట్లాడుతూ, ఆగస్ట్ 13 నుంచి 15 వరకు ప్రతి కార్యాలయం, ఇంటి వద్ద జాతీయ జెండా పండుగ అజాదికా అమృత్ మహోత్సవ లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజాధికా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా నుంచి గ్రామ స్థాయి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13 న జాతీయ జెండా ఆవిష్కరణ, 14 న వీరులను స్మరిస్తూ , ఎవరైతే దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారో వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించే కార్యక్రమం, 15 న రోడ్లకు ఇరువైపులా ఉన్న అంగళ్లకు చెట్లకు జాతీయ జెండాలు ప్రదర్శించి దేశ భక్తిని చాటే కార్యక్రమాల రూపకల్పన చేశామన్నారు . 16 న మండల, పురపాలక, నగరపాలక సంస్థల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఘనంగా అజాధికా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా స్థాయి లో కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఏ పి డి – జి.శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *