తాడిపూడి గ్రామంలో ప్రాధాన్యత భవనాలను ప్రారంభించిన మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన సందర్భంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధికి గత నాలుగున్నర ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబాటి రాంబాబు, హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.

బుధవారం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్ వాడి సెంటర్, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తో కలిసి హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నాడు నేడు కింద పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే స్కూల్స్ ను అభివృద్ధి చేయడం అభివృద్ధి కాదా ?.. ప్రజల ఆరోగ్యం కోసం వెల్ నెస్ సెంటర్స్ నిర్మించడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు చేపట్టడం అభివృద్ధి కాదా?.. అని విమర్శించే వాళ్ళను ప్రశ్నిస్తున్నా అని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్ష తో, తమ పిల్లలను కూలి పనులకు కాకుండా స్కూల్ కి పంపించాలని తలచి, తల్లుల ఖాతాకు రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక చేయూత నివ్వడం జరిగిందన్నారు. తద్వారా పరోక్షంగా వారికి చేదోడుగా నిలిచి ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపేలా ప్రేరణ కలిగించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. ప్రజా రోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆరోగ్య సర్వే నిర్వహించి, ప్రజలకు వైద్య సేవలను అందించిన ఘనత మన ప్రభుత్వం అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే ఆనాడు వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టి గుండె ఆపరేషన్స్ చేయించడం ద్వారా హార్ట్ ఎటాక్ నుంచి జీవితానికి భరోసా కల్పించారు. నేడు వైయస్ తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కింద రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజల ఆరోగ్యం పరిరక్షణ చేసే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు సి ఎస్ ఆర్ కింద చేసే విధానం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. పిల్లల విద్య , ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న చర్యలు అభివృద్ధికి నిజమైన నిదర్శనం గా మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నేడు తాళ్లపూడి మండలంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం మరుపురాని ఘట్టం గా అభివర్ణించారు. గతంలో ఇదే ప్రాంతంలో వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం తనను, కొండా సురేఖ ను ఇక్కడి పిలిచి మా చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేసిన ఘటనను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్కూల్స్ అభివృద్ధి చేశాం, వెల్ నెస్ సెంటర్లు నిర్మించాం అని చరిత్రలో నిలిచిపోయే ఏన్నో పనులను కేవలం ఈ నాలుగున్నర ఏళ్లలో సాధ్యం చేసి చెప్పుకునేలా చెయ్యడం జరిగిందన్నారు.

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో సాధ్యం కానీ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చెయ్యడం కేవలం జగనన్న ముఖ్యమంత్రి గా మాత్రమే సాధ్యం అవుతోందని అన్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో ఎన్నో జలవనరుల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. పైడిపట్ల ఎత్తిపోతల పథకం కింద గూటాల పంపింగ్ స్కీం కింద వచ్చే ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఇక్కడి రైతాంగం కోరికను నెరవేర్చలని పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను చేర్చడం తో పాటు ప్రాధాన్యత భవనాలు నిర్మించి ప్రజల కు పరిపాలనను మరింత చేరువ చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఇంత మంచి చేసిన జగనన్న పక్షాన నిలబడి రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. పేదల పక్షాన నిలబడే జగనన్న కు ఎప్పుడు ప్రజలు తమ మద్దతు ఇస్తారని తానేటి వనిత పేర్కొన్నారు.

పి. డి. ఐ. సి. డి. ఎస్, కె. విజయ కుమారి, సి. డి పి. ఓ, డి.మమ్మి, వ్యవసాయ శాఖ, జె. డి., మాధవరావు, కొవ్వూరు ఆర్. డి. ఓ, ఎస్. మల్లిబాబు, గ్రామ సర్పంచ్ నామ గోపాలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జెడ్పి వైస్, చైర్మన్ పోసిన శ్రీలేఖ, ఏ.ఎం.సి వల్లభసెట్టి శ్రీను, తాళ్ళపూడి ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షులు కుంటముక్కల కేశవ్, ఎం.దొర బాబు, పోసిన శ్రీ కృష్ణ దేవ రాయలు, మండిగ గిరి, మండల వైకాపా అధ్యక్షులు కాకర్ల వెంకటేస్వర రావు, ఎస్సి సెల్ అధ్యక్షులు సిర్ర గంగరావు, ఆతకురి దొరయ్య, చౌటుపల్లి వీరన్న, గన్ద్రోతు సురేంద్ర గిద్దా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *