రూ. 550కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి గోవర్థన రెడ్డి

-రైతుకు గిట్టుబాటు ధర.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ చర్యలు
-ఆయిల్ ఫామ్ లో కోకో అంతర్ పంటగా రైతులు పండించవచ్చు
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుకు గిట్టుబాటు ధరను అందిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోపర్థన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో 3ఎఫ్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఆధ్వర్యంలో 550 కోట్ల వ్యయంతో పర్యావరణహిత ఆయిల్ ఫామ్ పరిశ్రమకు మంత్రి గోపర్థన రెడ్డి, ఎం.కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలు అందించారని అధికారంలోకి రాగానే తెలంగాణ రైతులతో పాటు ఆంధ్ర రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకుని వినియోగదారులపై నూనె ధరలు భారం పడకుండా ఉండేందుకు ఇతర దేశాల నుండి దిగుమతి సుంకం తీసి వేయడం జరిగిందన్నారు. తద్వారా 50 శాతం ఆయిల్ మన దేశానికి దిగుమతి అవుతుందని అందుచేత రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉండటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దేశంలో రైతుల పండించే ఉత్పత్తులు వినియోగించుకుని మిగిలిన వాటిపై 15శాతం సుంకం విధించే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతామన్నారు. అయ్యవరంలో నెలకొల్పే పరిశ్రమల ద్వారా 1500 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన కల్పించబడిందని పేర్కొన్నారు. ఆయిల్ ఫాం నెలకొల్పేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. ఆయిల్ ఫామ్ లో కోకో అంతర్ పంటగా రైతులు వేసుకోవచ్చునని తద్వారా రాబడి పెరుగుతుందన్నారు. ఇక్కడ కంపెనీలు నిర్మించాలంటే లక్ష టన్నుల సామర్థ్యం కలిగివుంటే తప్ప మనుగడ సాధించలేమంటున్నారన్నారు. తూర్పుగోదావరితో కలపి మొత్తం రాష్ట్రంలో లక్ష టన్నుల సామర్థ్యం ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించకూడదనే నేపద్యంలో పరిశ్రమలు విస్తరించే దిశగా ఇంపోర్టు ఛార్జీలను నియత్రించామన్నారు. పరిశ్రమల స్థాపనకు మండలలాకు సంబందించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని వారి అనుభవం, పరిశ్రమల విస్తరణ, సామర్థ్యం, సేవలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఆయిల్ ఫాం కు సంబందించిన మండలాలను అలాట్ చేసామన్నారు. ఆయిల్ ఫాం పరిశ్రమలు అభివృద్ది కొరకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ ఆయిల్ ఫాం విస్తరిస్తూ గిట్టుబాటను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి గోవర్థన రెడ్డి అన్నారు. త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ చైర్మన్ సంజయ్ గోయింకా(goenka) మాట్లాడుతూ నల్లజర్ల మండలం అయ్యవరం లో 550 కోట్లతో పర్యావరణహిత ఆయిల్ ఫామ్ పరిశ్రమను నెలకొల్పుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ చైర్మన్ సంజయ్ గోయింకా(goenka), ఏలూరు ఎంపీ, కోటగిరి శ్రీధర్, గోపాల పురం ఎమ్మెల్యే, తలారి వెంకట్రావు, దెందులూరు ఎమ్మెల్యే, కే.అబ్బాయి చౌదరి, ఏపీ ఆయిల్ ఫెడ్, చావల బాబురావు, అయ్యవరం సర్పంచ్, గుడిసె వీరస్వామి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *