-2024 జనవరి 27, 28 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు
-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ కు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మాధవీ లత పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ , గోదావరి బాలోత్సవం నిర్వాహకులు, ఇతర అధికారులతో కలిసి గోడ ప్రతిని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి మాధవి లత మాట్లాడుతూ, జనవరి 27 ,28 తేదీల్లో తలపెట్టిన బాలోత్సవం రెండవ పిల్లలపండుగ విజయవంతం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు. గోదావరి బాలోత్సవం మొదటి పిల్లలపండుగను 2023 ఫిబ్రవరి లో జయప్రదం గా జరిగిందని, రెండవ పిల్లల పండుగను 2024 జనవరి 27,28 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి పిల్లల పండుగలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల ల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసారని, రెండవ పిల్లల పండుగను కూడా అదేవిధంగా జయప్రదం చేయాలనీ కోరారు.
బాలోత్సవ కమిటీ నిర్వాహకురాలు తులసి మాట్లాడుతూ, ఈసారి రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం మండలం తో పాటు రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలను కూడా కలుపుకొని మొత్తం 6 మండలాలలోని, ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాల ల్లో చదివే 2 వ తరగతి నుంచి, 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరూ బాలోత్సవ్ లో పాల్గొనవచ్చని వారు తెలిపారు. కల్చరల్, అకాడమిక్ విభాగాల్లో 32 అంశాల్లో 60 పోటీలను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ లెవెల్స్ లో నిర్వహిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు ఒకే ప్రాంగణం లో వివిధ వేదికలపై వందలాదిమంది పిల్లలతో కన్నులపండుగ గా జరిగే ఈ రెండవ పిల్లలపండుగను జయప్రదం చేయాలనీ వారు కోరారు.
గొడప్రతి ఆవిష్కరణలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, బాలోత్సవం నిర్వాహకులు పి. తులసి, పి. మురళీకృష్ణ, డి. సాయిబాబా, అద్దంకి రాజయోనా, పడాల రామకృష్ణ, కామేశ్వరశర్మ ల, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News