ర్యాపిడ్ ఎకనమిక్ గ్రోత్ పై నీతి అయోగ్ సమీక్ష

-విశాఖపట్నం గ్రోత్ హబ్ లో తూర్పు గోదావరి జిల్లా పాత్ర పై సమీక్ష
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ప్రత్యేక గుర్తింపు కలిగి, అదే క్రమంలో పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రం గా, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల పరంగా తనదైన ముద్ర కలిగి ఉన్నట్లు తూర్పు గోదావరీ జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం గ్రోత్ హబ్, ర్యాపిడ్ ఆర్థిక అభివృద్ధి చెందే విధానంలో సమీపంలో ఉన్న జిల్లాల ప్రభావం పై సమీక్ష నిర్వహించారు. వెలగపూడి నుంచి ప్రణాళిక ఎక్స్ అఫిషియో & కార్యదర్శి గిరిజా శంకర్ హజరవ్వగా ఈ సమావేశంకు స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత హాజరై జిల్లా యొక్క ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. సిపివో ఎ. ముఖ లింగం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంస్కృతి సంప్రదాయాలకు, రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన రాజమహేంద్రవరం నేడు అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందని మాధవీ లత పేర్కొన్నారు. పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేస్తూ జిల్లాలో రూ. 6786.65 పెట్టుబడితో స్థాపించబడిన 37 భారీ మరియు మెగా పరిశ్రమలు ద్వారా 17,453 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. సూక్ష్మ , చిన్న తరహా, మధ్యస్థ తరహా పరిశ్రమిక పరంగా రూ. 1925.71 కోట్ల పెట్టుబడితో నేటి వరకు 16,056 యూనిట్లు స్థాపించడం వల్ల 44,054 మందికి ఉపాధి కల్పించామన్నారు. జిల్లాలో ఖనిజ వనరులు క్రమంలో ఇసుక, సిల్ట్ & క్లే ఇసుక & సిల్ట్ విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక్కడ పవిత్ర గోదావరి నది లో లభ్యమయ్యే ఇసుక ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. ఈ భూములు ఎంతో సారవంతం మైనవి కావడమే కాకుండా , ఫైర్ క్లే రిఫ్రాక్టరీ పరిశ్రమలలో ఉపయోగించ బడుతుందని, ఎగుమతి కి ఆస్కారం కలిగి ఉన్నట్లు తెలిపారు.

రాజమహేంద్రవరం, సుధీర్ఘ గోదావరి నదీ పరివాహక ప్రాంతం మతపరమైన /ఆధ్యాత్మిక పర్యాటకం పుణ్య క్షేత్రం గా గుర్తింపు పొందినట్లు, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు ఇక్కడి ప్రత్యేకత అన్నారు. చివరిసారిగా 2015 లో ఇక్కడ పుష్కరాలు నిర్వహించామన్నారు. కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్, సరస్వతి ఘాట్, మార్కండేయస్వామి ఆలయం, పట్టిసీమ, సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం, కడియం నర్సరీలువంటివి ఈ ప్రాంతానికి ప్రత్యేకత తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఆరోగ్య రంగం పరంగా జిల్లాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ & 2 మెడికల్ కాలేజీలు , ఆసుపత్రుల సముదాయం కలిగి ఉండి మెడికల్ హబ్ గా వైద్య పరంగా సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

రహదారులు, ఇతర రవాణా వ్యవస్థ లో భాగంగా మౌలిక సదుపాయాలు రోడ్‌వేలు: 3 జాతీయ రహదారులు 118.70 కిమీ ,
రైల్వేలకు చెంది 64.60 కిమీలు మార్గాలు, రానున్న రోజుల్లో విజయవాడ విశాఖపట్నం
మార్గం నాలుగు రెట్లు పెంచడానికి ప్రణాళిక చేయబడిందని, ఆ క్రమంలో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందనున్నట్లు తెలిపారు.
విమానయానం మధురపూడి విమానాశ్రయానికి డొమెస్టిక్ పరంగా అనుకూలత రానున్న రోజుల్లో రూ. 347 కోట్ల పెట్టుబడితో రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ పనులు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. రోజుల్లో . విద్యా పరంగా విశిష్ట త కలిగి ఉండడం మరో ప్రత్యేకత అని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు.

ఎడ్యుకేషన్ హబ్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలతో కూడిన న్యాక్ ఎడ్యుకేషనల్ సంస్థ కలిగి ఉన్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో విశాఖ పట్నం గ్రోత్ లో తూర్పు గోదావరీ జిల్లా తగిన ప్రాధాన్యత కలిగి ఉండి ఇక్కడి యువత కు మరింత మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *