-రాజానగరం నియోజకవర్గంలో 4831 మందికి గాను 1091 ఎకరాల భూమి పంపిణీ…
-లంకభూముల రైతన్నలకు సంపూర్ణ భూ హక్కులు..
-దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు నేడు పరిష్కారం చూపించాం..
-జేసీ. ఎన్ . తేజ్ భరత్
-ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజానగరం/ సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సుదీర్ఘ కాలంనాటి భూ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతోపాటు నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా లు పేర్కొన్నారు.
మంగళవారం సీతానగరం మండలం కాటవరం గ్రామం నందు రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతు కుటుంబాలకు వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ, అసైన్డ్ భూములు, ఈనాం భూములు,ఎస్సీ కార్పొరేషన్ భూములు 22 ఏ జాబితా నుంచి తొలగించి భూమిలేని నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసమే భూమి పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి వంద ఏళ్లనాటి భూ సమస్య లకు సైతం ఈ ప్రభుత్వంలో పరిష్కార మార్గం చూపిందన్నారు. దశాబ్దాలుగా భూమి అనుభవిస్తున్న వారికే భూ హక్కు పత్రాలను జారీ చేశామన్నారు.
మన తూర్పుగోదావరి జిల్లాలో భూమిలేని 1296 మంది లబ్ధి నిరుపేదలకు1025 ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేస్తున్న మన్నారు. జిల్లాలో 3182 మందికి 919 ఎకరాల లంక భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. దశాబ్దలుగా నిషేధిత భూముల జాబితాలోని 1809 మందికి చెందిన 1564 ఎకరాల అసైన్డ్ భూములకు భూమి హక్కులు అందిస్తున్నట్లు జేసీ వివరించారు.
నిషేధిత భూముల జాబితా నుంచి అసైనన్డ్ భూములను తొలగించడం, భూమిలేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం,ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం,ఎస్సీలకు శ్మశాన వాటిక కోసం భూమి కేటాయింపులు చేయడం,లంక భూములకు పట్టాల పంపిణీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 38,432 మందికి 5,500 ఎకరాలు భూమిని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునట్లు తేజ్ భరత్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో యావరేజ్ గా ఒక ఎకరం 30 లక్షల రూపాయలు అనుకుంటే 5500 ఎకరాలు గాను 1650 కోట్ల రూపాయల విలువ గల భూమిని మన జిల్లాలో పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు అనేక రకాల పరిపాలన సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు చాలా కాలం నుండి వారి ఆధీనంలో ఉండి భూమి మీద పూర్తి హక్కు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారందరికీ ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహోసపేతమైన నిర్ణయాల వల్ల నిరుపేదలకు పెద్ద ఊరట కల్పించారన్నారు. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి రోపర్ లాండ్స్, బీసీ లకు సంబంధించి ప్రధానంగా సర్వీస్ ఈనాం భూములు, ఎస్సీలకు సంబంధించి అసైన్డ్ మెంట్ భూముల పట్టాల మీద సర్వ హక్కులు కల్పించదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం ఆలోచించి ఈ రకంగా మేలు చేసిన దాఖలాలు ఉన్నాయా అని జక్కంపూడి రాజా ప్రశ్నించారు?
రాజానగరం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పురుషోత్తం పట్నం ఇరిగేషన్ ప్రాజెక్టు నిమిత్తం రైతులు దగ్గర అడ్డగోలుగా బలవంతంగా భూములు లాక్కుని న్యాయపర మైన నష్ట పరిహారం ఇవ్వకుండా రైతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయన్నారు..
కానీ మన ప్రభుత్వంలో 31.75 లక్షల అక్కా చెల్లెమ్మల కోసం ఉచితంగా ఇళ్ల స్థలాల పట్టాలు అందించే విషయంలో ఎక్కడా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా న్యాయపరంగా డబ్బులు చెల్లించి వారి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీర్ఘ కాలంగా భూములు కలిగి ఉండి వాటి మీద హక్కులు లేకుండా ఉన్న వారందరికీ సర్వహక్కులు కల్పించి మన ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. నిన్న మొన్నటిదాకా ఒక సామాన్యుడిగా జీవించిన వారిని నేడు పట్టాలు అందించి లక్షధికారులుగా చేశామన్నారు. పేదవాడి జీవితంలో మార్పును తీసుకువచ్చి ధైర్యంగా జీవించే విధంగా భరోసా ఇవ్వగలిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వమన్నారు. మన నియోజక వర్గంలో 4832 మందికి గాను వివిధ భూముల కింద దాదాపు 1100 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. లంక భూములకు సంబంధించి బి మరియు సి క్లాస్ ల పరిధిలో భాగంగా 1488 మందికి గాను 274 ఎకరాల భూములను అందించడం జరిగిందన్నారు. గతంలో లంక భూములు ఒక సంవత్సరానికి మాత్రమే లీజు కు ఇస్తే నేడు జగనన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుందని దీని కారణంగా ఎస్సీ సొసైటీలో ఉన్న సభ్యులకు పూర్తిగా లబ్ధి చేకురే విధంగా హక్కులను ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రాల జోష్ణ జడ్పిటిసి చల్లమల్ల వెంకటలక్ష్మి సుజీరాజు, కన్వీనర్ గంట శ్రీను,కరుటూరి హరిబాబు,కొండ్రపు ముత్యాలు డాక్టర్ బాబు వైస్.ఎంపీపీలు మదన బాబు సురేష్ రాజు,గెద్దాడ త్రిమూర్తులు అంబటి రాజు మద్దాల కొండలరావు గణేశుల పోశయ్య రమాదేవి వివిధ గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News