రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కి చెందిన చెల్లింపులు 24 గంటల్లో రైతుల ఖాతాలకు జమ అవుతున్నట్లు, రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు .
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి రెవెన్యూ సంస్కరణలు, ఎన్నికలు, పౌర సరఫరాలు, రీ సర్వే, ఖరీఫ్ లో వరి సేకరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై శిక్షణ పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సమీక్ష చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్నట్లు పేర్కొన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయి లో అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో అసైన్డ్ భూములు, లంక భూములు, ఇనాం భూములు, స్మశాన వాటిక లు, జీఓ 60 ప్రకారం సుమారు 5495 ఎకరాలు భూములకు సంబంధించిన పంపిణీ, తదితర ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. అసైన్డ్ భూములకు చెంది 1296 మందికి చెందిన 1025 ఎకరాలకు గాను 522 లకు 390 ఎకరాలు, లంక భూములకు చెంది 3182 లబ్దిదారులకు సుమారు 920 ఎకరాలకు గాను 536 మందికి 127 ఎకరాలు, ఇనాం భూములు 3009 మందికి 1964 ఎకరాలలో 619 మందికి 577 ఎకరాలు, స్మశాన వాటిక లు 54 ఎకరాలు, జీఓ 60 ప్రకారం 95 మందికి గాను 30 మందికి కేటాయింపులు పూర్తి చేశామన్నారు. వీటిని ఆయా ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ పూర్తి చెయ్యాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యాయని, ఇప్పటికే క్షేత్ర స్థాయి లో ఆర్భికే వారీగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు, ప్రస్తుత వాతావరణ మార్పులు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో 231 అర్భికెల పరిధిలో కొనుగోళ్లు చేపట్టడం జరుగుతోందని ఇప్పటికే 167 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోలు చేసిన రైతుల ఖాతాలోకి 24 గంటల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పూర్తి సమన్వయం చేస్తూన్నట్లు తెలిపారు. కోతలు కోతలు కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు, కుప్ప నూర్పిడి, తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఎన్నికల అంశంపై మాట్లాడుతూ, ఓటరు నమోదు , తొలగింపు, చిరునామా మార్పుల కు చెందిన ఫారం 6, 7 , 8 లను నిర్ణీత సమయం లో పరిష్కారం చెయ్యలన్నారు. , స్వీప్ కార్యక్రమాలపై , రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నివేదిక లను అందచెయ్యలన్నారు. జిల్లాలో 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో 10 మంది కి మించి ఓటర్లు ఉన్న 122 డోర్ నంబర్ల సందర్శన పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికే ఆయా నియోజక వర్గ ఓటరు నమోదు అధికారులకు వివరాలు పి ఎస్ వారీగా పంపినట్లు తెలిపారు. వెంటనే ఆర్వోలు వ్యక్తిగత బాధ్యత తీసుకుని నివేదికలు అందచేయాలని పేర్కొన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, రీ సర్వే ప్రగతి పై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఫేజ్ 3 లో 90 గ్రామాల్లో చేస్తున్న ప్రక్రియ లో గ్రౌండ్ ట్రూధింగ్, వీఏస్, తహశీల్దార్ లాగిన్ లో పెండింగ్ పనులను పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. జిల్లాలో 573189 రేషన్ కార్డు దారుల్లో 434305 మందికి రేషన్ పంపిణీ చేయడం జరిగిందని, ఎమ్ డి యూ వాహనం ద్వారా క్షేత్ర స్థాయిలో పంపిణీ తనిఖీ చేసి వివరాలు అప్లోడ్ చెయ్యాలని పేర్కొన్నారు.
ఎన్నికల అంశంపై మాట్లాడుతూ, ఓటరు నమోదు , తొలగింపు, చిరునామా మార్పుల కు చెందిన ఫారం 6, 7 , 8 లను నిర్ణీత సమయం లో పరిష్కారం చెయ్యలన్నారు. , స్వీప్ కార్యక్రమాలపై , రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నివేదిక లను అందచెయ్యలన్నారు. జిల్లాలో 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో 10 మంది కి మించి ఓటర్లు ఉన్న 122 డోర్ నంబర్ల సందర్శన పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికే ఆయా నియోజక వర్గ ఓటరు నమోదు అధికారులకు వివరాలు పి ఎస్ వారీగా పంపినట్లు తెలిపారు. వెంటనే ఆర్వోలు వ్యక్తిగత బాధ్యత తీసుకుని నివేదికలు అందచేయాలని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలు సంబంధిత డిఎస్పీ లు ద్వారా సేకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందజేయ్యాలని కోరారు.
ఈ సమావేశంలో డి ఆర్వో జీ. నరసింహులు,ఈ కార్యక్రమంలో డిపివో జిల్లా నోడల్ అధికారి జేవి సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఏం రజనీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు పి. సువర్ణ, ఎమ్. భాను ప్రకాష్, అధికారులుడి ఏ వో ఎస్ . మాధవరావు, పి. వీణా దేవి, డిటిసి కేవి కృష్ణా రావు, డి ఎం ఎ.కుమార్, డి ఎస్ వి విజయ భాస్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News