న్యాయ విజ్ఞాన సదస్సు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పరిజల్లిపేట గ్రామపంచాయతీ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఒక గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామంలోని న్యాయ సమస్యలను, వివాదాలను పరిష్కరించి వివాద రహిత ఆదర్శ గ్రామంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిజల్లి పేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల సహకారం కావాలనీ, వారి సమస్యలను, ఫిర్యాదులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని అన్నారు. వారికి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం, 1987 ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. ఈ సదస్సులో రాజానగరం సిఐ. పి. కాశి విశ్వనాథం, ఎస్సై పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *