కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోతలు పూర్తి చేసుకుని కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం ను మిల్లుకు తరలించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోతలు పూర్తి చేసుకుని అరబెట్టు కున్న పంటను తక్షణం మిల్లులకు తరలించే చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అందరి అధికారులను అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాలకు పంపడం దగ్గర ఉండి మిల్లులకు తరలించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరుగుతున్నట్లు తెలిపారు. తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు మండలాల పరిధిలో పర్యటించి రైతులకి , క్షేత్ర స్థాయి సిబ్బంది, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈమేరకు ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేపట్టి రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో క్షేత్ర స్థాయి లో పర్యటించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News