Breaking News

బాల మిత్ర బాలల హక్కుల కోసం వాసవ్య లో శిక్షణా శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి మరియు కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బెంజ్ సర్కిల్ నందుగల వాసవ్య మహిళా మండలి లో ఒకరోజు శిక్షణా శిభిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కె.జి.వి సరిత, యస్.పి.ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సి.ఐ.డి శిక్షణను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులను రూపుమాపడానికి ప్రతిఒక్కరూ సహకారాన్ని అందివ్వాలని అన్నారు. దీనివల్ల జరుగే అనర్ధాలను పాఠశాల దశ నుండే పిల్లలకు తెలియజేయడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు సమాజాని ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఈ బాలమిత్ర కార్యక్రమాన్ని రాబోవు రోజులలో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళే ప్రణాళికలను రూపొందిస్తామని ఆమె అన్నారు. పిల్లల పరవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆమె అన్నారు. ప్రతి విద్యార్ధి ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని దానికి అనుగుణంగా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆమె అన్నారు.

వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ కృష్ణా మరియు యన్.టి.ఆర్ జిల్లాలలోని పాఠశాలల నుండి 240 మంది పాల్గొన్నారని వీరు 7,8,9 తరగతి చదివే విద్యార్ధినీ విద్యార్థులకు ఒక్కరోజు శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేశామని వీరు తమతమ పాఠశాలలో ఇతర విధ్యార్థులకు అవగాహనను ఇచ్చేలా ఈ రోజు శిక్షణను నిర్వహిస్తున్నామని వీరు బాల మిత్రాలుగా ఉంటారని ఆమె అన్నారు. వీరు బాల్యవివాహాలను నిరోధించేందుకు వారధిగా పనిచేస్తారని ఆమె అన్నారు. బాల్యవివాహాల వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని కావున ఒక వేళ ఎవరికైనా చిన్న వయస్సులోనే పెళ్ళి చేయాలి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు అమ్మాయిలు మేము వెళ్ళి చేసుకోము అని ధైర్యంగా చెప్పాలని అలా చెప్పిన నాడే దీనిని రూపుమాపగలమని ఆమె అన్నారు.

అనంతరం ఎ.సి.పి, దిష పోలీస్ స్టేషన్, వి.వి నాయుడు మాట్లాడుతూ బాలలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు మనకు అనేక చట్టాలు వచ్చాయి ఇవి నేరం రుజువు అయితే అత్యంత కఠినమైన శిక్షలు పడతాయన్నారు. తెలియని వ్యక్తులతో మాట్లాడకుండా ఉండటం, ఎవరైనా ముట్టుకున్నప్పుడు అది గుడ్ టచ్/బ్యాడ్ టచ్ తెలుసుకొని ముందు అక్కడనుండి వెళ్ళి పోవాలని, అసలు మనం వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఫేస్ బుక్, వాట్స్ యాప్, మొబైల్, ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో పడకుండా చదువుపై శ్రద్ధ చూపాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం వార్డ్ ఆరోగ్య కార్యదర్శి కడ విజయలక్ష్మి మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి చేసే కార్యక్రమాల వల్ల ఎందరో మహిళలకు అండగా ఉంటూ వారి జీవితాలలో భాగమయ్యారని ఇప్పుడు బాల కార్మికులు, బాల్యవివాహలు, బాలలపై లైంగిక హింస జరగకుండా చేసే కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో అవసరం అని ఆమె అన్నారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతీ విషయాన్ని ఆచరణలో పెడుతూ ఇతరులకు శిక్షణను ఇవ్వాలని బాలలకు పిలుపునిచ్చారు.

అనంతరం వాసవ్య మహిళా మండలి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి.దీక్ష మాట్లాడుతూ మనలను చూసి ఎవరైనా సినిమా యాక్టర్ లా ఉన్నావు అని అన్నప్పుడు నిజమని మీరు అనుకుంటే ఎదుటువారికి అవకాశం ఇచ్చినట్లే అని ఒకసారి అద్దం ముందు నిలుచుని పోల్చుకొని చూసుకుంటే వస్తవం మనకు తెలుస్తుందని కాబట్టి ప్రలోభాలకు లోనుకావద్దని పిల్లలకు హితవు పలికారు.

అనంతరం వాసవి, సి.ఐ, దిశ పోలీస్ స్టేషన్ మాట్లాడుతూ ఎవరైఅనా మనతో మాట్లాడేటప్పుడు చేతులు, తల నిమురుతున్నట్లైతే అది గుడ్ టచ్ అని లేకుండా
ఇతర శరీర భాగాలను తాకినట్లైతే అది బ్యాడ్ టాచ్ అని ఆమె అన్నారు. ఇలాంటి సందర్భం ఎవరికైనా ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు
చెప్పాలని అప్పుడు అది అక్కడతో ఆగుతుందని లేదంటే ఇతర పరిణామాలను ఎదుర్కొనవలని వస్తుందని ఆమె అన్నారు.

శిక్షణ ఇచ్చిన వారిలో సైబర్ సేఫ్టి పై రాజా వర్షయస్.ఐ. సైబర్ పోలీస్ స్టేషన్, పీర్ ప్రెజర్ పై డాక్టర్ సుదీప్తి వర్ధన్, అధ్యక్ష్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జి. రశ్మి, కార్యదర్శి, వాసవ్య మహిళా మండలి, బి. సుజాత, కోశాధికారి వాసవ్య మహిళా మండలి, బి. చంద్రశేఖర్ రాష్ట్ర సమన్వయకర్త, జాన్సన్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, వాసవ్య సిబ్బంది జి. రామాంజనేయులు, సాంబశివరావు, అమల, యాక్మెస్ టు జస్టిస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *